top of page
MediaFx

'భారతీయుడు 2' జ్యూక్‌బాక్స్ విడుదల

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కలయికలో రూపొందుతున్న 'ఇండియన్ 2' గురించి అందరికి తెలిసిందే. ఈ చిత్రం తెలుగులో 'భారతీయుడు 2' అనే టైటిల్ తో విడుదల కానుంది. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్ర ఆడియో జ్యూక్‌బాక్స్ ని మూవీ మేకర్స్ తాజాగా విడుదల చేశారు.సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, ఎస్‌జే సూర్య తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జులై 12, 2024న విడుదల కానుంది. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని ఉదయనిధి స్టాలిన్ యొక్క రెడ్ జెయింట్ మూవీస్ తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నారు.

bottom of page