ఢిల్లీ మద్యం కుంభకోణం(Liquor Scam Case) కేసులో అరెస్టై తిహాడ్ జైల్లో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను(Kavitha) జ్యుడీషియల్ కస్టడీలోనే విచారించేందుకు సీబీఐకి(CBI) రౌజ్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సోమవారం తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను అరెస్టు చేసిన ఈడీ.. మొత్తం పది రోజులపాటు తమ కస్టడీలోనే విచారించిన విషయం తెలిసిందే. అనంతరం ఆమెకు న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ కస్టడీ కూడా మంగళవారం ముగియనుంది. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సోమవారం కోర్టు తీర్పు రానుంది. ఈ నేపథ్యంలోనే సీబీఐ తెరపైకి వచ్చింది.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవితది కీలక పాత్రని, ఆమెను విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని, ఆమెను జ్యుడీషియల్ కస్టడీలోనే విచారించడానికి తమకు అనుమతి ఇవ్వాలని రౌజ్ అవెన్యూ కోర్టులో సీబీఐ శుక్రవారం పిటిషన్ దాఖలు చేసింది. కవితను గతంలోనే విచారించామని, కేసుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు సేకరించామని, ఈ దశలో మరోసారి విచారిేస్త కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని సీబీఐ తెలిపింది. దాంతో, కవితను విచారించేందుకు అనుమతి ఇస్తున్నామని రౌజ్ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి కావేరి బవేజా స్పష్టం చేశారు. కవితను జ్యుడిషియల్ కస్టడీలోనే ఇంటరాగేట్ చేయడానికి, ఆమె ేస్టట్‌మెంట్‌ను రికార్డు చేయడానికి అనుమతి ఇస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే, తిహాడ్ జైలు అధికారులకు ఒకరోజు ముందే సమాచారం ఇవ్వాలని, విచారించే సమయంలో తప్పనిసరిగా మహిళా కానిస్టేబుళ్లు అందుబాటులో ఉండాలని, అన్ని నిబంధనలను పకడ్బందీగా పాటించాలని నిర్దేశించారు. ల్యాప్‌టాప్, స్టెషనరీ సామగ్రి తీసుకెళ్లడానికి సీబీఐకి అనుమతి ఇచ్చారు.
ఈ నేపథ్యంలో వచ్చే వారంలో కవితను సీబీఐ అధికారులు విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. సోమవారం కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తీర్పు రానుంది. బెయిల్ వస్తుందా? లేదా పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టి వేస్తుందా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ కవితకు బెయిల్ వస్తే.. సీబీఐ మళ్లీ ఆమెను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మళ్లీ కోర్టులో రిమాండ్ చేసి సీబీఐ కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్టు సమాచారం. బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తే తిహాడ్ జైలులోనే కవితను విచారించనున్నారు.