top of page
Shiva YT

‘సోలో బాయ్‌’గా బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ.. సందీప్ మాస్టర్‌తో లింకేంటి? 🎬🤔

ఈ మూవీకి సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బుధవారం నాడు రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ గారు మాట్లాడుతూ.. కోవిడ్ టైంలో తాను బట్టల రామస్వామి బయోపిక్ అనే సినిమా తీశానని, ఆ టైంలో ఓటీటీ ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశానని అన్నాడు. తర్వాత ఒక మంచి కథ కోసం ఎదురు చూస్తున్న టైం లో సోలో బాయ్ కథ నచ్చి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాని తెలిపాడు. రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ పూర్తయిందనన్నాడు. ఆకాశవీధిలో, బిగ్ బాస్ షోతో అలరించిన గౌతమ్ ఇక సోలో బాయ్‌గా ఎంటర్టైన్ చేస్తాడని చెప్పుకొచ్చాడు. 🌟🎭

గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ.. ఆకాశవీధిలో చేసినప్పుడు నటుడిగా మంచి గుర్తింపు వచ్చందన్నాడు. ఆ తర్వాత వేరే కథలు వింటున్న టైంలోనే బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని తెలిపాడు. ఆ షోతో జనాలు బాగా ఆదరించారని చెప్పుకొచ్చాడు. ఇలా ఈ రోజు మా సోలో బాయ్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కావడం హ్యాపీగా ఉందన్నాడు. ఇక మున్ముందు టీజర్ ట్రైలర్ ప్రమోషన్స్ తో కొత్తగా మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ షోతో ఎలా అయితే ఆదరించారో ఇప్పుడీ సినిమాతో కూడా అలాగే ఆదరించి ఆశీర్వదించాలని ప్రేక్షకుల్ని కోరాడు. ఈ సినిమాని సెవెన్ హిల్స్ సతీష్ ప్రొడ్యూస్ చేయడం ఆనందంగా ఉందన్నాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం తప్పకుండ అలరిస్తుందని దర్శకుడు అన్నాడు. 🎥🌟

bottom of page