top of page
Shiva YT

🚨 ఢిల్లీ లిక్కర్ కేసులో బిగ్ డే, ఒకేరోజు విచారణకు కవిత, 🚔

ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సైతం సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ సీఎంను ఈడీ విచారణకు పిలిచిన రోజే కవితను కూడా 26న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇవ్వడం ఉత్కంఠగా మారింది. దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు గతంలో హైదరాబాద్‌ వచ్చి కవితను ఆమె ఇంట్లో ప్రశ్నించారు. ఈడీ అధికారులు మాత్రం రెండుసార్లు ఢిల్లీకి పిలిపించి విచారించారు. అయితే మహిళను ఇంట్లోనే విచారించాలని చట్టంలో వెసులుబాటు ఉందని ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ నెల 28కి కేసును వాయిదా వేసింది. ఇదిలా సీబీఐ కవితకు నోటీసులు జారీ చేయడం, విచారణకు హాజరు కావాలని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. ⚖️



bottom of page