శివాజీకి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన పల్లవి ప్రశాంత్..🎥✨
- Suresh D
- Mar 21, 2024
- 1 min read
బిగ్‌బాస్ టైటిల్ ప్రైజ్ మనీ మొత్తాన్ని పేద రైతు కుటంబాలకి అందజేస్తానని విన్నర్ పల్లవి ప్రశాంత్ అప్పట్లో ప్రకటించాడు. ఆ తర్వాత దీనిపై ఎలాంటి ఆచరణ లేకపోవడంతో నెటిజన్లు గట్టిగానే సెటైర్లు వేశారు. దీంతో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నా అంటూ ఇటీవల ఓ రెండు వీడియోలను షేర్ చేశాడు. ఇందులో ఓ పేద కుటుంబానికి రూ.లక్షతో పాటు ఏడాదికి సరిపడే బియ్యాన్ని పంచాడు ప్రశాంత్. ఇక ఈ కార్యక్రమానికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లు శివాజీ, సందీప్ మాస్టర్, భోలే షావలి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా శివాజీకి సరదాగా ఓ గిఫ్ట్ ఇచ్చాడు రైతు బిడ్డ. ఇందుకు సంబంధించిన ఫొటోను తాజాగా షేర్ చేశాడు. ఈ గిఫ్ట్ చూసి నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
శివాజీ చేతిలో ఓ బ్రూ కాఫీ పొడి డబ్బా పెట్టాడు పల్లవి ప్రశాంత్. దీంతో శివాజీ తెగ నవ్వుకున్నాడు. ఇంతకీ శివాజీకి కాఫీ డబ్బా రైతుబిడ్డ ఎందుకిచ్చాడనేది బిగ్‌బాస్ ఆడియన్స్‌కి బాగా తెలుసు. ఎందుకంటే కాఫీ కోసం బిగ్‌బాస్ హౌస్‌లో పెద్ద యుద్ధమే చేశాడు శివాజీ. కాఫీ పొడి పంపించకపోతే హౌస్ నుంచే బయటికి పోతా అంటూ ఏకంగా బిగ్‌బాస్‌కే వార్నింగ్ ఇచ్చాడు. దీంతో శివాజీ హౌస్‌లో ఉన్న అన్ని రోజులూ కాఫీ పొడి డబ్బాలు పంపిస్తూనే ఉన్నాడు బిగ్‌బాస్. ఇక దీని కోసం శోభా శెట్టి కూడా పెద్ద గొడవే చేసింది. శివాజీకి కాఫీ పొడి దొరక్కుండా తన ప్లేస్‌లో చాలా సార్లు దాచేసింది. దీంతో మొత్తానికి శివాజీకి ఫన్నీగా ఇలా కాఫీ పొడి డబ్బా గిఫ్ట్‌గా ఇచ్చాడన్న మాట ప్రశాంత్.🎥✨