బిగ్‌బాస్ సీజన్ 7లో అందరికంటే ప్రత్యేకం పల్లవి ప్రశాంత్. రైతు బిడ్డగా హౌస్‌లో అడుగుపెట్టి.. ఇప్పుడు టైటిల్ రేసులో దూసుకుపోతున్నాడు.
కామన్ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్.. తన ఆట తీరుతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ముఖ్యంగా ఇంటి సభ్యులతో తన మాట తీరు.. ప్రవర్తన.. అందరిని అన్నా, అక్కా అంటూ పిలుస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక అప్పటివరకు సైలెంట్‌గా ఉండే ప్రశాంత్.. టాస్కులలో మాత్రం అదరగొట్టేశాడు. మొదటి వారం రతికతో స్నేహం.. ఆ తర్వాత పులిహోర బిడ్డగా మారిపోవడంతో అతడిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. కానీ నమ్మిన స్నేహమే రతిక నామినేట్ చేయడం.. ఆ తర్వాత ఆమెతో జరిగిన గొడవలతో తెరుకున్నాడు. దీంతో తన ఫోకస్ మొత్తం ఆటపై పెట్టాడు. శారీరకంగా.. మానసికంగా తనకంటే బలవంతులతో పోటీ పడి మరీ అల్లాడించేశాడు. ప్రశాంత్ ఆట చూసి కంటెస్టెంట్స్, అడియన్స్ సైతం అవాక్కయ్యేలా చేశాడు. ఇక ఇప్పుడు టైటిల్ రేసులో టాప్ 3 స్థానంలో దూసుకుపోతున్నాడు. తాజాగా పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్ జర్నీని ఎంతో ఎమోషనల్‌గా చూపించాడు బిగ్‌బాస్. 🌟👏