తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే తొలిసారిగా బీసీలకు సీఎంగా అవకాశం కల్పిస్తామన్నారు. బీజేపీ మాటతప్పదు.. ఇది తన హామీ అంటూ ప్రత్యేకంగా హామీ ఇచ్చారు నరేంద్ర మోదీ. 🚀📣
ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని..🚀📣 తెలంగాణలో తమకు అధికారమిస్తే మాదిగ సామాజిక వర్గానికి న్యాయం చేస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణకు కమిటీ వేస్తున్నాం సుప్రీంకోర్టులో మాదిగ సామాజిక వర్గం తరపున న్యాయ పోరాటం చేస్తామన్నారు. 🚀📣ఎస్సీ వర్గీకరణ కోసం రోడ్ మ్యాప్ తయారవుతోందని వివరించారు. యువతకు ఉపాధి కల్పిస్తామని బీఆర్ఎస్ అవినీతిని పారదోలాలని పిలుపునిచ్చారు.🚀📣 కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీజేపీపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయన్నారు ప్రధాని మోదీ. కాంగ్రెస్‌కు వేసే ప్రతి ఓటుతో బీఆర్ఎస్‌కు లబ్ధి చేకూరుతుందని చెప్పుకొచ్చారు. 🚀📣కాంగ్రెస్, బీఆర్ఎస్ దళితులకు, బీసీలకు చేసిందేమీ లేదని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేశారని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణలో బీజేపీ పాలనపై నమ్మకం పెరుగుతోందన్నారు. 🚀📣బీఆర్ఎస్‌ను ఓడించే సత్తా బీజేపీకే ఉందని చెప్పుకొచ్చారు. 🚀📣