ప్రజారాజకీయాల్లో BJP-ఆర్ఎస్ఎస్ మధ్య సంబంధం గురించి ఎవరికైనా తెలిసిన విషయం. ఈ పార్టీ రాజకీయాల్లో అడుగు తీసి అడుగు వేయాలన్నా ఆర్ఎస్ఎస్ నుంచి ఆదేశాలు రావాల్సిందే అన్న మాట ఒకటి ప్రచారంలో ఉంటుంది. BJP, RSS వేర్వేరు కాదని, RSS రాజకీయ రూపమే BJP అని ప్రతిపక్షాలు చాలా కాలంగా ఆరోపిస్తూనే ఉన్నాయి. కానీ ఈసారి ఎన్నికల ఫలితాల తర్వాత ఆర్ఎస్ఎస్-బీజేపీ మధ్య ఏమి జరుగుతోందని అనుమానం కలుగుతుంది. ఆర్ఎస్ఎస్ లక్ష్యాలను నెరవేర్చే బీజేపీపై RSS పెద్దలు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు.
ఏం జరిగింది అంటే, 375 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న BJP 240 సీట్ల దగ్గరే ఆగిపోయింది. భారీ మెజారిటీ తెచ్చుకోవాలన్న ఉద్దేశ్యం నెరవేరకపోయినా కూడా పదేళ్ల పాటు వరుసగా అధికారంలో ఉండి ఇన్ని సీట్లు సాధించడం సామాన్య విషయం కాదని ఒప్పుకోవాలి. మోదీ మేనియానే ఈ ఘనతకు కారణం అనే అభిప్రాయం కూడా వినబడుతోంది. అయితే, 240 సీట్లకు పరిమితం కావడంపై ఆర్ఎస్ఎస్ అసంతృప్తితో ఉందని, అందుకే బహిరంగ విమర్శలకు దిగిందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
RSS చీఫ్ మోహన్ భగవత్ కొన్ని వ్యాఖ్యలు చేశారు, సమాజంలో విభజన, మణిపూర్ పైన ఇతరులను గౌరవించడం వంటి విషయాలపై. వీటికి ఏం అర్థం అంటే, మోదీ ప్రభుత్వ విధానాలపై ఆర్ఎస్ఎస్ అసంతృప్తి ఉంది. మణిపూర్ సమస్యను చక్కదిద్దడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారు.
మరి, ఈ అద్భుత రాజకీయ నాటకం తరువాత ఏమి జరుగుతుందో చూడాలి.