top of page
Suresh D

బీజేపీ – కాంగ్రెస్‌ఫై కేటీఆర్ సంచలన ఆరోపణలు🗳️✨

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నాయకుల విమర్శలు చూస్తుంటే.. ప్రజలకు కొత్త కన్ఫ్యూజన్‌ మొదలైంది. ఏ పార్టీకి ఎవరు సహకరిస్తున్నారో.. ఎవరి కోసం ఎవరు త్యాగం చేస్తున్నారో.. ఎవరికి ఎవరు ప్రత్యర్థులో తెలియడంలేదు.

బీజేపీ నాయకులు.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఫ్రెండ్‌షిప్‌ చేస్తున్నాయంటూ విమర్శలు చేస్తుంటే.. కాంగ్రెస్‌ నేతలు.. బీజేపీ బీఆర్‌ఎస్‌ ఒకటే అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇక బీఆర్‌ఎస్‌ నాయకులు కూడా తమను ఓడించడానికి ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ కాంగ్రెస్‌ కలిసి పనిచేస్తున్నాయంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మోదీ, రేవంత్‌ కలిసి ఇదే పనిలో ఉన్నారంటూ కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్‌ ఎక్స్‌క్లూజివ్‌ క్రాస్‌ఫైర్‌ ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు.🗳️



bottom of page