📣 ఏపీలో సొంతంగా ఎదగాలనుకుంటున్న బీజేపీ.. విశాఖ కేంద్రంగా జరిగిన రాష్ట్ర పదాదికారుల సమావేశంలో సందేశం ఇదే. రాష్ట్రంలో సంస్థాగతంగా బలపడాలని, ఇందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేయాలని నిర్ణయించారు పార్టీ పెద్దలు. పార్టీకి బలం కార్యకర్తలు.. ఆ కార్యకర్తల అండతోనే బలమైన శక్తిగా రాష్ట్రంలో ఎదగాలని బీజేపీ భావిస్తోంది. 💪
🧭 అత్యంత కీలకమైన పార్టీ పదాదికారుల సమావేశంలో పొత్తులపైనా, మిత్రపక్షం జనసేనతో కలిసి ఉద్యమించాల్సిన అవసరాన్ని పార్టీ అధ్యక్షురాలు ప్రస్తావించకపోవడంతో మరోసారి ఈ ఊహాగానాలు జోరందుకున్నాయి. 2020లో రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. అయితే జనసేన తమ మిత్రపక్షమే అంటున్న బీజేపీ ఏనాడూ ఉమ్మడి కార్యాచరణతో జనాల ముందుకు రాలేదు. చివరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ పోటీచేసినా జనసేన మద్దతు కోరలేదు. గతంలో సోము వీర్రాజు సారధ్యంలోని రాష్ట్ర బీజేపీ కమిటీ జనసేనతో కలిసి ఉద్యమించిన సందర్భాలు లేవు. కొత్తగా పార్టీ బాధ్యతలు తీసుకున్న పురంధేశ్వరి పదేపదే జనసేన అధ్యక్షులు పవన్‌తో కలిసి భవిష్యత్తుపై చర్చిస్తామని ప్రకటించినా ఇంతవరకూ భేటి జరగలేదు. తాజాగా జరిగిన మీటింగ్‌లోనూ కేడర్‌కు పొత్తులపై సరైన స్పష్టత కూడా ఇవ్వలేదు.
🗳️ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ముందస్తు వస్తాయని కూడా పవన్ కల్యాణ్ అంటున్నారు. ఈ సమయంలో పొత్తులపై మాత్రం ఎవరి వెర్షన్ వారు వినిపిస్తున్నాయి. అటు జనసేన చూస్తే టీడీపీకి దగ్గరగా జరుగుతున్నట్టు ప్రచారం ఉంది. జనసేనకు బీజేపీ దూరమవుతున్నట్టుగా వ్యూహాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా పొత్తులపై కాలమే సమాధానం చెప్పాలి. 💬