top of page

‘370 సీట్లు గెలుచుకోవడమే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి’: ప్రధాని మోదీ 🗳️🎙️

Suresh D

భారతీయ జనతా పార్టీ రెండు రోజుల జాతీయ కౌన్సిల్ సమావేశాలు శనివారం ఢిల్లీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. సమావేశాల తొలిరోజు పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కనీసం 370 సీట్లు గెల్చుకోవాలని పిలుపునిచ్చారు.

మరో మూడు నెలల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 370 లోక్ సభ స్థానాలను గెలుచుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. తద్వారా దివంగత నేత శ్యామ ప్రసాద్ ముఖర్జీ చేసిన త్యాగానికి ఘనంగా నివాళులర్పించినట్లు అవుతుందన్నారు. జమ్మూకశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు కోసం జీవితాంతం ఉద్యమించిన శ్యామ ప్రసాద్ ముఖర్జీకి ఇది నిజమైన నివాళి అవుతుందన్నారు.ఢిల్లీలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు శనివారం నుంచి రెండు రోజుల పాటు జరగనున్నాయి. తొలిరోజు ప్రధాని మోదీ పార్టీ ఆఫీస్ బేరర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయాలన్న ఉద్యమానికి శ్యామ ప్రసాద్ ముఖర్జీ నేతృత్వం వహించారు. 2019 లో పార్లమెంటు చట్టం ద్వారా ఈ ఆర్టికల్ 370 ని రద్దు చేశాం. బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాల జాబితాలో ఆర్టికల్ 370 రద్దు అనేది అగ్రస్థానంలో ఉంది’’ అన్నారు. ఆర్టికల్ 370 రద్దు గత కొన్ని దశాబ్దాలుగా బీజేపీ ఎన్నికల హామీగా ఉంది. పేదలకు అనుకూలమైన పనులు, దేశాభివృద్ధి, అంతర్జాతీయంగా పెరిగిన ప్రతిష్ఠ.. తదితర అంశాలపై ప్రధానంగా పార్టీ లోక్ సభ ప్రచారాన్ని రూపొందించాలని బీజేపీ సభ్యులను ప్రధాని మోదీ కోరారు.

ప్రతి బూత్ లో కనీసం 370 ఓట్లు బీజేపీ ఖాతాలో చేరేలా చూడాలని క్యాడర్ ను ప్రధాని ఆదేశించారు. కార్యకర్తలు అందరూ ఓటర్ల వద్దకు వెళ్లి 2014కు ముందు భారత్ కు, ఇప్పటి భారత్ కు మధ్య ఉన్న వ్యత్యాసం గురించి వివరించాలని సూచించారు. బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో ఆఫీస్ బేరర్లను ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన ప్రసంగం వివరాలను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే మీడియాకు వివరించారు. ప్రతిపక్షాలు చేసే ప్రతికూల ప్రచారాలను తిప్పికొట్టాలని ప్రధాని మోదీ పార్టీ క్యాడర్ ను కోరారు. అనవసరమైన విషయాల్లో చిక్కుకుని, పార్టీ ప్రతిష్టను దెబ్బతీయవద్దని హెచ్చరించారు. 🔊🔍

 
bottom of page