top of page
MediaFx

బ్లాక్ కలర్ డ్రస్ లో మైండ్ బ్లాక్ చేస్తోన్న చందమామ..


అందాల చందమామ కాజల్ అగర్వాల్.. ప్రస్తుతం రీఎంట్రీతో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన కాజల్ అగర్వాల్. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. 

సీనియర్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు అందరికి జోడీగా నటించింది కాజల్ అగర్వాల్. తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది ఈ చిన్నది. అక్కడ కూడా స్టార్ హీరోల సినిమాల్లో మెరిసింది. 

ఇక ఈ అమ్మడు పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కాజల్ అగర్వాల్ తిరిగి సినిమాల్లో బిజీగా మారింది. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాలో హీరోయిన్ గా చేసింది కాజల్. 

అలాగే సత్యభామ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలోనూ నటించింది ఈ అమ్మడు. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవలే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

పెళ్లైన తర్వాత కూడా ఈ అమ్మడు తన గ్లామర్ తో ఆకట్టుకుంది. రెగ్యులర్ గా తన అందమైన ఫోటోలను షేర్ చేస్తుంది. తాజాగా బ్లాక్ కలర్ డ్రస్ లో అదరగొట్టింది కాజల్.. ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ పిక్స్ పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

bottom of page