top of page
Suresh D

“టిల్లు స్క్వేర్” ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించిన క్రేజీ ఎంటర్టైనర్ చిత్రం “టిల్లు స్క్వేర్” కోసం తెలిసిందే. మరి సాలిడ్ హైప్ నడుమ వచ్చిన ఈ క్రేజీ సీక్వెల్ మొదటి భాగం కంటే పెద్ద హిట్ కాగా ఈ సినిమాతోనే సిద్ధూ తన కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ ని అందుకున్నాడు.అయితే థియేటర్స్ లో డీసెంట్ రన్ ని కొనసాగించిన ఈ చిత్రం ఫైనల్ గా ఓటిటి రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతుంది. మరి ఈ సినిమా హక్కులు సొంతం చేసుకున్న దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు అఫీషియల్ డేట్ ని అయితే ఇచ్చేసారు. దీనితో ఈ చిత్రం ఈ ఏప్రిల్ 26 నుంచి స్ట్రీమింగ్ కి రాబోతుంది.అలాగే ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కి వస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు. దీనితో ఈ చిత్రం తెలుగు సహా తమిళ్, కన్నడ, మళయాళం హిందీ భాషల్లో రానుంది. ఇక ఈ చిత్రానికి అచ్చు, రామ్ మిర్యాల అలాగే భీమ్స్ లు సంగీతం అందించగా సితార ఎంటెర్టైమెంట్స్, ఫార్చూన్ 4 సినిమాస్ వారు నిర్మాణం వహించారు.


bottom of page