బోట్ కంపెనీ వరుసగా స్మార్ట్ వాచ్ లను లాంచ్ చేస్తోంది. అత్యుత్తమ ఫీచర్లతో పాటు అధిక నాణ్యతతో కూడిన స్మార్ట్ వాచ్ లను తక్కువ ధరకే వినియోగదారులకు అందిస్తోంది. 📱💲
గత వారంలో బోట్ వేవ్ ఎలివేట్ స్మార్ట్ వాచ్ తీసుకొచ్చిన కంపెనీ ఇప్పుడు వారం తిరక్కుండానే మరో స్మార్ట్ వాచ్ బోట్ లూనార్ విస్టాను ఆవిష్కరించింది. ఈ స్మార్ట్ వాచ్ క్లీన్ సర్కులర్ డిజైన్ తో వస్తోంది. 🔄బ్లూ టూత్ కాలింగ్ ఫీచర్ దీనిలో ఉంది. 🎧ఈ కొత్త స్మార్ట్ వాచ్ లో 1.52 అంగుళాల హెచ్ స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ ఎండలో కూడా క్లియర్ గా కనిపిస్తుంది. 📺ఈ స్క్రీన్ మీకు 100 వరకూ వాచ్ ఫేసెస్ ను అందిస్తుంది. 👥ఒక సులువైన రోటేటింగ్ బటన్ తో నావిగేషన్ కు అనుమతి ఇస్తుంది. 🔄ఈ స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కు మద్దతు ఇస్తుంది. 📞మంచి మైక్రోఫోన్, డయల్ ప్యాడ్ ఉంటుంది. 🎤📝10కాంటాక్ట్ ల వరకూ సేవ్ చేసుకోవచ్చు. 🔟✉️వీటి సాయంతో వేగంగా కాల్స్ చేసుకొనే వెసులు బాటు ఉంటుంది. ఒకవేళ మీకు స్పోర్ట్స్ లో ఆసక్తి ఉంటే మీకు 100 వరకూ స్పోర్ట్స్ మోడ్లు అందుబాటులో ఉంటాయి. ఇక హెల్త్ ఫీచర్ల విషయానికి వస్తే.. దీనిలో హార్ట్ రేటింగ్ మోనిటరింగ్, రక్తంలోని ఆక్సిజన్ లెవెల్స్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఉంటాయి. ❤అలాగే మహిళల రుతు చక్రాన్ని ట్రాక్ చేస్తుంది. 🚺📅అదే విధంగా శ్వాస సంబంధిత వ్యాయామాలు దీనిలో ఉంటాయి. 💨🧘♀️ఎక్కువ సేపు కూర్చొనే పనిచేసేవారికి రిమైండర్లను అందిస్తుంది. 🕐🔔కెమెరాలోని ఫోన్ సాయంతో పలు ఫీచర్లను అందిస్తుంది. 📷📱వెదర్ అప్ డేట్లు, అలారం వంటి అదనపు సదుపాయాలు కల్పిస్తుంది. 🌦️🚨