top of page
Suresh D

ఓటీటీలోకి వచ్చేసిన ‘భోళాశంకర్‌’..🎥🎞️

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన లేటెస్ట్‌ సినిమా భోళాశంకర్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని ఈ మెగా మాస్‌ ఎంటర్‌టైనర్‌ ఇప్పుడు ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం (సెప్టెంబర్‌ 15) నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతుంది.

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన లేటెస్ట్‌ సినిమా భోళాశంకర్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని ఈ మెగా మాస్‌ ఎంటర్‌టైనర్‌ ఇప్పుడు ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం (సెప్టెంబర్‌ 15) నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతుంది. మెహర్‌ రమేశ్‌ తెరకెక్కించిన భోళాశంకర్‌ సినిమాలో చిరంజీవి సరసన మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించింది. మహానటి కీర్తిసురేష్ మెగాస్టార్ చెల్లెలుగా సందడి చేసింది. యంగ్ హీరో అక్కినేని సుశాంత్‌ మరో కీలక పాత్రలో మెరిశాడు. భారీ అంచనాలతో ఆగస్టు 11న విడుదలైన భోళాశంకర్‌ ఆడియెన్స్‌ని నిరాశపర్చింది. మొదటి షో నుంచే నెగెటివ్‌ టాక్‌ రావడంతో బాక్సాఫీస్‌ వద్ద మెగాస్టార్‌ సినిమా చతికిలపడింది. వసూళ్ళ పరంగానూ నిరాశపరచింది. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని భోళాశంకర్‌ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. థియేటర్‌ రిలీజుకు ముందే భారీ ధర వెచ్చించి మరీ చిరంజీవి సినిమాను కొనుగోలు చేసింది సదరు ఓటీటీ సంస్థ. ఈ క్రమంలో ముందస్తు ఒప్పందం ప్రకారం శుక్రవారం నుంచి ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో భోళాశంకర్‌ అందుబాటులో ఉంది.🎥🎞️


bottom of page