top of page
MediaFx

బాలీవుడ్ స్టార్ తో గోపీచంద్ భారీ ప్రాజెక్ట్ అప్డేట్ వచ్చేసింది

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. క్రాక్, వీరసింహా రెడ్డి సినిమాలతో హిట్ కొట్టిన ఈ దర్శకుడు రవితేజతో సినిమా చేయాల్సి ఉంది కానీ, కొన్ని కారణాల చేత ఆగిపోయింది.తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ తో సినిమా చేస్తున్నారని రూమర్స్ వచ్చాయి. ఈ క్రేజీ కాంబినేషన్ పై మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. సన్నీ డియోల్ తో కలిసి దేశంలోనే బిగ్గెస్ట్ యాక్షన్ సినిమా నిర్మిస్తున్నట్లు తెలిపారు.షూటింగ్ త్వరలోనే మొదలు పెట్టబోతున్న ఈ చిత్రం మాస్ ఫీస్ట్ అందించబోతుందని చెప్పారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ఇండియన్ సినిమా దగ్గర మరొక క్రేజీ కాంబినేషన్ అని చెప్పాలి.


bottom of page