ప్రస్తుతం బిగ్ స్క్రీన్ అయినా.. ఓటీటీ అయినా బోల్డ్ కంటెంట్ కు ప్రేక్షకుల్లో బిగ్ రెస్సాన్స్ వస్తోంది. అందుకే బాలీవుడ్ దర్శక నిర్మాతలు బోల్డ్ సినిమాలు తెరకెక్కిస్తూనే కమర్షియల్స్ ఎలిమెంట్స్ తో పాటు గుడ్ మెసేజ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. గతంలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించిన గంగుభాయి లాంటి బోల్డ్ సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. దీంతో బాలీవుడ్ మేకర్స్ ఇలాంటి సినిమాలపై ఫోకస్ చేస్తున్నారు. అయితే లేటెస్ట్ గా మరో బోల్డ్ మూవీ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు సిద్ధమవుతోంది.
ఏక్తా కపూర్ నిర్మించిన “లవ్ సెక్స్ ఔర్ ధోఖా 2” లో ఒక ట్రాన్స్ జండర్ పై తెరకెక్కిన మూవీ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో బోనితా రాజ్ పురోహిత్ అనే ట్రాన్స్ యాక్టర్ కులు పాత్రలో కనిపించనున్నారు. రాజ్ కుమార్ రావు, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సహా కొత్త ముఖాలను పరిచయం చేయడంలో ఏక్తా కపూర్ కు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఇప్పుడు ఈ జాబితాలో బోనితను చేరింది. అయితే 2010లో దిబాకర్ బెనర్జీ దర్శకత్వం వహించిన ‘లవ్ సెక్స్ ఔర్ ధోఖా’ మూవీ కొనసాగింపుగా పార్ట్ 2 రాబోతోంది.
“ఖోస్లా కా ఘోస్లా”, “ఓయ్ లక్కీ” చిత్రాలతో ప్రసిద్ధి చెందిన దిబాకర్ ఈ సీక్వెల్ లో తన నైపుణ్యాన్ని చాటుకున్నాడు. అయితే ఒరిజినల్ చిత్రం “లవ్ సెక్స్ ఔర్ ధోఖా” తన వినూత్న కథనాలతో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రయోగాత్మక సినిమాలు హిందీ సినిమాల్లో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. దీంతో సీక్వెల్ పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ‘లవ్ సెక్స్ ఔర్ ధోఖా 2’ 2024 ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.