నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా శ్రీకాంత్ తదితరులు కలయికలో మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన సెన్సేషనల్ హిట్ చిత్రం “అఖండ”.
మరి తెలుగు సినిమాకి పూర్వ వైభవం తీసుకొచ్చిన ఈ సినిమా సీక్వెల్ కోసం ఎందరో ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తూ వస్తున్నారు.అయితే ఈ సినిమా పై లేటెస్ట్ గా బోయపాటి శ్రీను స్పందించడం వైరల్ గా మారింది. అఖండ రెండవ భాగం ఎన్నికల తరువాత ప్రకటిస్తామని ఈ సారి సామాజిక అంశాలతో పార్ట్ 2 ఉండబోతుంది అని కన్ఫర్మ్ చేశారు. దీనితో ఈ అవైటెడ్ సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకి ఈ వార్త ఊరటనిస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ముందుముందు రానున్నాయి.🎥✨