top of page
MediaFx

అందుకే బోయపాటి తమన్‌ను లైన్‌లో పెట్టాడా..?🎬🎶


టాలీవుడ్ లో మాస్ దర్శకుడిగా మంచి పేరున్న దర్శకుడు బోయపాటి శ్రీను. భద్ర సినిమాతో దర్శకుడిగా పరిచయమైన బోయపాటి శ్రీను ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు. అలాగే కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా చేశారు. బోయపాటి సినిమాలకు మాస్ క్రేజ్ ఉంటుంది. బోయపాటి సినిమాలకు మ్యూజిక్ హైలైట్ అనే చెప్పాలి. ఆయన సినిమాల్లో మ్యూజిక్ చాలా స్పెషల్ గా ఉంటుంది. భద్ర, తులసి, లెజెండ్, జయ జానకి నాయక, వినయ విధేయ రామలాంటి సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలని మ్యూజికల్ గాను సూపర్ హిట్ గా నిలిచాయి. అయితే దేవీ శ్రీకి, బోయపాటి శ్రీను కు మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే.. దాంతో బోయపాటి సినిమాలకు దేవీ మ్యూజిక్ అందించడం మానేశారు.

జయ జానకి నాయక సినిమా సక్సెస్ ఈవెంట్ లో దేవీ శ్రీ, బోయపాటి మధ్య మాటల యుద్ధం జరిగింది. బోయపాటి శ్రీను చెన్నైకి వెళ్లి తనతో 14 రోజుల పాటు పనిచేసిన తర్వాత డీఎస్పీ నుంచి ట్యూన్‌లు తీసుకున్నానని చెప్పడంతో అసలు గొడవ మొదలైంది. అసలు ఏం జరిగిందంటే..

‘నేను దేవిశ్రీను ఈ సినిమా కోసం  నిద్రకూడా పోనివ్వలేదు. దేవీ శ్రీ మ్యూజిక్ చేసినఅన్ని రోజులు నేను ఆయనతో ఉన్నాను’ అంటూ బోయపాటి చెప్పుకొచ్చారు. వెంటనే దేవి మైక్ తీసుకొని దానికి రివర్స్ పంచ్‌లు వేసేశాడు. బోయపాటి నన్ను నిద్రపోనివ్వడం ఏంటి.? సరైన మ్యూజిక్ ఇచ్చేంతవరకూ నేనే నిద్రపోను., నా పని నేను చేసుకున్నా.. బోయపాటి ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది చాలా తక్కువ. అది కూడా ల్యాప్ టాప్ లో ఇంగ్లిష్ సినిమాలు చూస్తూ కుర్చున్నాడు అంటూ స్టేజ్‌పైనే దిమ్మతిరిగే పంచ్ వేసేశాడు. అప్పట్లో ఇది పెద్ద దుమారం రేపింది. ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వినయ విధేయ రామ సినిమా వచ్చింది. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆతర్వాత బోయపాటి సినిమాలకు దేవీ శ్రీ దూరంగా ఉంటూ వస్తున్నారు. దేవీ ప్లేస్ లోకి తమన్ ను తీసుకువచ్చారు బోయపాటి. ఈ ఇద్దరి కాంబోలో అఖండ, స్కంద సినిమాలు వచ్చాయి.


bottom of page