top of page
MediaFx

బాయ్‌ఫ్రెండ్ సిక్‌నెస్‌తో బాధపడుతున్న యువత


ఆధునిక కాలంలో మానసిక సమస్యలు పెరిగిపోతున్నాయి. ఈ మానసిక సమస్యలను తట్టుకోవాలంటే మానసిక నిపుణుల పర్యవేక్షణ చాలా అవసరం. ఇప్పుడు ప్రపంచంలో బాయ్‌ఫ్రెండ్ సిక్‌నెస్‌తో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువ అయిపోతోందట. వారు బయటికి ఆరోగ్యంగా కనిపిస్తున్నా మనసులో మాత్రం అనారోగ్యంతో బాధపడుతున్నట్టు ఫీల్ అవుతారు. ఏ పనీ చేయలేరు. అబ్సెసివ్ ప్రవర్తనను కలిగి ఉంటారు. ఈ బాయ్‌ఫ్రెండ్ సిక్‌నెస్‌ అనేది ఈ మధ్య పుట్టిన పదమే. కానీ దీంతో బాధపడుతున్న వారు ఎక్కువ మంది ఉన్నారు.

ప్రేమలో పడిన వ్యక్తుల్లోనే ఈ బాయ్‌ఫ్రెండ్ సిక్‌నెస్‌ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. పేరుకి బాయ్‌ఫ్రెండ్ సిక్‌నెస్‌ అయినా అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరికీ చెందిన వ్యాధి ఇది. అబ్బాయిలకి కూడా ఈ బాయ్‌ఫ్రెండ్ సిక్‌నెస్‌ లక్షణాలు కనిపించవచ్చు. ఇది ఒక తాత్కాలిక దశ. కొన్ని రోజులకు తగ్గిపోతుంది. దీనికి ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం లేదు. అనుబంధాలను కాపాడుకుంటే చాలు.

కొలంబియా యూనివర్సిటీలో సైకియాట్రీ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అమీర్ లెవెన్ ఈ బాయ్‌ఫ్రెండ్ సిక్‌నెస్‌ గురించి వివరించారు. కొత్తగా ప్రేమలో పడినవారు, అలాగే తమకి ఇష్టమైన వారితో లైంగిక అనుబంధాన్ని కలిగి ఉన్నవారికి ఈ బాయ్‌ఫ్రెండ్ సిక్‌నెస్‌ వచ్చే అవకాశం ఎక్కువ. మెదడు నిత్యం ఆ భాగస్వామితో బంధాన్ని కోరుకుంటునే ఉంటుంది. దీనికోసం అది ఓవర్ టైం పనిచేస్తుంది. ఆ భాగస్వామి ఆలోచనల్లో మెదడు అధిక సమయం పని చేసి అలసిపోతుంది. ఒక అపరిచితమైన వ్యక్తిని తమ ప్రియమైన వ్యక్తిగా అంగీకరించడం కోసం మెదడులో చాలా న్యూరో సర్క్యురీ వైరింగ్ జరుగుతుంది. దీనివల్లే మెదడు విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి వస్తుంది. ఇది ఇతర అనుబంధాలపై కూడా కాస్త ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ బాయ్‌ఫ్రెండ్ సిక్‌నెస్‌ బారిన పడిన వారికి కొన్ని రకాల సంకేతాలు కనబడతాయి.

బాయ్‌ఫ్రెండ్ సిక్‌నెస్‌ లక్షణాలు

జీవితంలో పరిచయమైన కొత్త భాగస్వామి చుట్టూ మీ మెదడు తిరుగుతూ ఉంటుంది. మీరు స్వతంత్రంగా ఏ పనీ చేయలేరు. ఒంటరిగా కూడా నిర్ణయాలు తీసుకోలేరు. ఆ సమయంలో కొత్త భాగస్వామి గుర్తు వస్తూ ఉంటారు. కుటుంబం లేదా స్నేహితులతో గడపడానికి తక్కువ సమయాన్ని కేటాయిస్తారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కొత్త భాగస్వామితో మాట్లాడతారు. అలాగే ఆ వ్యక్తి తప్పులు చేస్తున్నా కూడా వాటిని వాటిని మీరు అడ్డుకోలేరు. వాటిని విస్మరించడం ప్రారంభిస్తారు. మీ భాగస్వామి అందుబాటులో లేనప్పుడు చాలా ఇన్‌సెక్యూరిటీగా ఫీల్ అవుతారు. మీతో అతనితో సమయం గడిపేందుకు మనసు విలవిలలాడుతుంది. ఆ వ్యక్తి దగ్గర లేనప్పుడు ఏదో బందీఖానాలో ఉన్నట్టు ఫీల్ అవుతారు. ముఖ్యంగా లైంగిక అనుబంధాన్ని కొత్తగా పెట్టుకున్న వారిలో ఈ బాయ్‌ఫ్రెండ్ సిక్‌నెస్‌ అధికంగా ఉంటుంది. మీరు అధికంగా ఫోన్లో మాట్లాడుతూ గడిపేందుకు ఇష్టపడతారు. బాయ్‌ఫ్రెండ్ సిక్‌నెస్‌కి ప్రత్యేకంగా ఎలాంటి మందులు ఉండవు. కొంతకాలానికి దాని మటుకు అదే తగ్గిపోతుంది. ఇలాంటివారు మానసిక వైద్యులను కలవాల్సిన అవసరం కూడా లేదు. తమని తాము ఇతర పనుల్లో బిజీ చేసుకుంటే సరిపోతుంది. అలాగే కొత్త బాయ్ ఫ్రెండ్ తో పాటు ఇంట్లోనే కుటుంబం, స్నేహితులకు కూడా విలువ ఇవ్వడం చేస్తే బ్రెయిన్ పై కాస్త ఒత్తిడి తగ్గుతుంది. నిత్యం కొత్త బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ గురించే ఆలోచిస్తూ ఉంటే మెదడులో తీవ్ర ఒత్తిడి కలిగి అవకాశం ఉంది.

bottom of page