బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఈ మధ్య బ్రెజిల్ నటితో డేటింగ్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. 26 ఏళ్ల ఆర్యన్.. బ్రెజిల్‌కు చెందిన 34 ఏళ్ల నటి లారిస్సా బోనేసితో డేటింగ్‌లో ఉన్నట్లు వీరిద్దరూ ముంబై వీధుల్లో రాత్రంతా లాంగ్‌డ్రైవ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాక తన అరంగేట్ర సినిమా కోసం బిజీగా ఉన్న ఆర్యన్ ఇన్‌స్టాలో లారిస్సా ఫ్యామిలీని ఫాలో అవుతున్నారట. ఇటీవల లారిస్సా తల్లి బర్త్ డే సందర్భంగా విలువైన బహుమతిని కూడా అందజేసినట్లు బాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. అయితే తాజాగా వీళ్లిద్దరూ ఒక పార్టీలో కలిశారు.
ఆగష్టు 04 అదివారం వీకెండ్ కావడంతో ముంబై నైట్ పార్టీకి వెళ్లింది. లారిస్సా బోనేసి బ్లాక్ కలర్ డ్రెస్‌లో వచ్చిన ఆమె పార్టీకి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇక మీడియా ఫొటోలు అంటూ అడుగగా సున్నితంగా తిరస్కరిస్తూ ముందుకు వెళ్ళింది. అయితే తాను వెళ్లిన కాసేపటికే ఆర్యన్ ఖాన్ అతడి సోదరి సుహానా ఖాన్ ఈ పార్టీకి వచ్చారు.
బ్లాక్ కలర్ టీషర్ట్, బ్లూ కలర్ డెనిమ్ జాకెట్‌లో ఆర్యన్ రాగా.. సుహానా ఖాన్ హగ్గింగ్ డ్రెస్‌లో పార్టీకి వచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఆర్యన్ ఖాన్, లారిస్సా బోనేసి ఒకే పార్టీలో ఉండడంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు వస్తున్న వార్తలు నిజం అని తెలుస్తుంది. బ్రెజిల్‌కు చెందిన మాడల్, నటి లారిస్సా బోనేసి బాలీవుడ్ మూవీ గో గోవా గాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో కూడా సాయి ధరమ్ తేజ్‌తో తిక్కా అనే సినిమాలో నటించింది.