బ్రేకప్ నిజంగా చాలా బాధాకరం: తమన్నా
- MediaFx
- Sep 9, 2024
- 1 min read
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్‌వ్యూలో తన విఫల ప్రేమకథల గురించి గుర్తుచేసుకుంది మిల్కీబ్యూటీ తమన్నా. ఆమె హృదయం ఇప్పటికి రెండు సార్లు ముక్కలైందట. ఈ విషయంపై తమన్నా మాట్లాడుతూ ‘బ్రేకప్ నిజంగా చాలా బాధాకరం. అది అనుభవించిన వారికే తెలుస్తుంది. నా జీవితంలో రెండుసార్లు బ్రేకప్‌ని ఎదుర్కొన్నాను. టీనేజ్‌లో ఉన్నప్పుడే తొలి హార్ట్‌బ్రేక్ ఎదురైంది. జీవితంలో ఏదోఒకటి సాధించాలనేది నా అభిమతం. ఓ వ్యక్తికోసం లక్ష్యాన్ని వదులుకోవడం నచ్చలేదు. ఆ కారణంలో ఓ బంధం తెగిపోయింది. అది జరిగిన కొన్నేళ్ల తర్వాత ఓ వ్యక్తిని ఇష్టపడ్డా. అతనితో కొంతకాలం రిలేషన్లో ఉన్నా. అతను మాట్లాడితే అబద్ధాలే. అనవసరంగా అబద్ధాలాడేవాళ్లంటే నాకు అసహ్యం. తను నాకు సెట్ కాడని మనసు చెప్పింది. దాంతో అతడ్ని కట్ చేయక తప్పలేదు.’ అని గత జ్ఞాపకాలను నెమరు వేసుకుంది.