మలయాళ ఇండస్ట్రీ నుంచి ఈ మధ్యకాలంలో సూపర్ హిట్ సినిమాలు వస్తున్నాయి. ఈమధ్య వచ్చిన సినిమాల్లో ‘ప్రేములు’, ‘మంజుమ్మెల్ బాయ్స్’, ‘బ్రహ్మయుగం’ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అదేవిధంగా అదే విధంగా ఇపుడు ‘ఆడుజీవితం’ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. మార్చి 28న ఈ చిత్రాన్ని మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ చాలా కష్టపడ్డాడు. కాగా ఆడుజీవితం స్పెషల్ షోస్ చూసిన సినీ సెలబ్రెటీలు సినిమాపై ప్రశంసలు కురిపించారు.
ఇటీవల కొంతమంది ప్రముఖుల కోసం ‘ఆడుజీవితం’ సినిమా స్పెషల్ షోను ఏర్పాటు చేశారు. లోకనాయకుడు కమల్‌హాసన్, దర్శకుడు మణిరత్నం మరికొంతమంది ఆడుజీవితం సినిమాను మెచ్చుకున్నారు. ‘బ్లెస్సీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇది ఒక వ్యక్తి జీవిత కథ. ఈ సినిమా కథలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ చాలా కిలోలు బరువు తగ్గాడు. తాజాగా కమల్ హాసన్ పృథ్వీరాజ్ నటనను మెచ్చుకున్నారు. అయన మాట్లాడుతూ.. పృథ్వీరాజ్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమా కోసం ఇంతగా కష్టపడతారని అనుకోలేదు. సినిమాటోగ్రాఫర్ సునీల్ కెఎస్ వర్క్ నిజంగా చాలెంజింగ్ గా ఉంది. ఈ సినిమాను ప్రజలు ఆదరించాలని కమల్ కోరారు.
మణిరత్నం ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి, ఇది మిమ్మల్ని ఊపిరి బిగబట్టి కూర్చోబెడుతుంది. ప్రథ్వీరాజ్, టీమ్ అంతా బాగా కష్టపడ్డారు. బ్లెస్సీ అద్భుతంగా తెరకెక్కించాడు’ అని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో ‘ఆడుజీవితం’ స్పెషల్ షో కూడా ఏర్పాటు చేశారు. ఇందులో హను రాఘవపూడి, శ్రీను వైట్ల సహా పలువురు దర్శకులు పాల్గొన్నారు.