🎬🍿 'బ్రో' సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. 🎉💥
- Suresh D
- Jul 31, 2023
- 1 min read
జులై 28న విడుదలైన బ్రో సినిమాలో పవన్‌తో పాటు సాయి ధరమ్ తేజ్ మరో హీరోగా నటించాడు. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ మెగా మల్టీ స్టారర్‌లో కేతిక శర్మ, ప్రియాంక వారియర్ కథానాయికలు.

జులై 28న విడుదలైన బ్రో సినిమాలో పవన్‌తో పాటు సాయి ధరమ్ తేజ్ మరో హీరోగా నటించాడు. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ మెగా మల్టీ స్టారర్‌లో కేతిక శర్మ, ప్రియాంక వారియర్ కథానాయికలు. త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే సమకూర్చగా, థమన్ బాణీలు అందించారు. 🎭🌟మొదటి రోజే రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన బ్రో.. రెండో రోజు మాత్రం కాస్త తగ్గాడు. అయితే ఆదివారం కావడంతో మళ్లీ పుంజుకున్నాడు. కాగా విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాపంగా బ్రో సినిమా రూ.100 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించిందని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ ట్వీట్ చేశారు. మొదటి రోజు 48.09 కోట్లు, రెండో రోజు రూ.27.61 కోట్లు సాధించిన బ్రో మూవీ ఆదివారం రూ.25 కోట్లు రాబట్టిందని మనోబాల ట్విట్టర్‌లో తెలియజేశారు. 📈💰