🌐 తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ చిత్రం వచ్చింది. కేసీఆర్ రైడ్ పేరిట అతను రోడ్లపై సైకిల్ తొక్కుతున్న సమయంలో గూగుల్ రూట్ మ్యాప్ వినియోగించాడు.
అందుకు ముందుగా సెలక్ట్ చేసుకున్న ప్రాంతాలను అనుసంధానం చేస్తూ సైకిల్ తొక్కాడు. అంతాపూర్తయిన తర్వాత అతను ప్రయాణించిన మార్గాన్ని గూగుల్ మ్యాపింగ్ చేశాడు. ఇలా అన్ని మార్గాలను కలుపగా అచ్చంగా కేసీఆర్ స్కెచ్ వచ్చింది. కేసీఆర్‌పై తనకున్న అభిమానాన్ని మల్లారెడ్డి ఇలా వినూత్నంగా చాటడం ప్రతి ఒక్కరినీ అబ్బురపరుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను బీఆర్‌ఎస్ పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. మీరు చూడండి..
📅🗳️ కాగా తెలంగాణలో నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రచారం కార్యక్రమాల్లో ఆయా రాజకీయ నేతలు ఫుల్ బిజీగా ఉన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు నేడు చివరి రోజు కావడంతో ఆకరి నిమిషం వరకు నేతలు ప్రచారం నిర్వహించనున్నారు. ఇక పోలింగ్ అనంతరం డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. 📆🗳️✨