top of page

సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత..

MediaFx

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించారు. ఈ మేరకు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. జూలై 1న హైకోర్టు కవిత బెయిల్ పిటిషన్లను తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆమె ఆశ్రయించారు. ఢిల్లీ, లిక్కర్‌ పాలసీకి సంబంధించి ఈడీ, సీబీఐ కేసులలో బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఆగష్టు 12 సుప్రీంకోర్టు విచారించనుంది. న్యాయమూర్తులు జస్టిస్ విశ్వనాథ్‌, జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం కవిత బెయిల్ పిటిషన్ కేసును విచారించనుంది. ఇప్పటికే కవితకు బెయిల్ మంజూరు చేసేందుకు ట్రయల్ కోర్టు, హైకోర్టు నిరాకరించాయి. సుమారు ఐదు నెలలుగా తీహార్ జైలులోనే కవిత ఉంటోంది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ, మనీలాండరింగ్‌ కేసులో ఎమ్మెల్సీ కవితను గత మార్చి 15న ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీబీఐ అధికారులు సైతం విచారణ చేపట్టారు. గత ఏప్రిల్ 11న ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను సీబీఐ అరెస్ట్ చేయగా, ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ కోర్టులు కూడా జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీని పొడిగిస్తున్నాయి.

bottom of page