top of page
Shiva YT

🔍 లోక్‌సభ పోల్స్‌పై బీఆర్ఎస్ ఫోకస్.. !

📊 క్షేత్రస్థాయిలో లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు సమీక్షలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ కూడా కొద్దిరోజుల్లోనే లోక్ సభ ఎన్నికలపై సమగ్రంగా చర్చించే అవకాశం ఉన్నది.

అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏ మాత్రం జాప్యం కాకుండా చూడాలని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి, ప్రచారంపై ఫోకస్ చేయాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నారు. ప్రచార వ్యూహాలపై కూడా ఆ పార్టీ నేతలు ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని లోక్‌సభ ఎన్నికల్లో ఇదిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నది బీఆర్ఎస్ నేతల వ్యూహంగా తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పోల్చితే 2 శాతం ఓట్లు మాత్రమే బీఆర్ఎస్‌కు తగ్గాయి. ఆచరణ సాధ్యంకాని హామీలు, దుష్ప్రచారంతోనే కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

👤 తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య దాదాపు అన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ ఖాయంగా తెలుస్తోంది. కాంగ్రెస్, అటు బీజేపీని ఎదుర్కొనేందుకు పక్కా వ్యూహాలతో ముందుకెళ్లాలని బీఆర్ఎస్ నేతలు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 📊

bottom of page