top of page
Suresh D

రేవంత్ సర్కార్ పై బీఆర్ఎస్.. రాష్ట్ర వ్యాప్త నిరసనలకు కేటీఆర్ పిలుపు..📣🗣️

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిప్పటి నుంచి రెండు గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రచారంలో చెప్పిన హామీల ప్రకారం మరిన్ని పథకాలను అమలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడంపై కాంగ్రెస్ అశ్రద్ద వహిస్తోందంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిప్పటి నుంచి రెండు గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రచారంలో చెప్పిన హామీల ప్రకారం మరిన్ని పథకాలను అమలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడంపై కాంగ్రెస్ అశ్రద్ద వహిస్తోందంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అందుకుగాను రేవంత్‌ సర్కార్‌పై యుద్ధం ప్రకటించింది బీఆర్‌ఎస్‌. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. మరి, ఈ నిరసనలు ఎందుకో? దేనికోసమో ఇప్పుడు తెలుసుకుందాం. కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాలపై ఆందోళనలకు సిద్ధమవుతోంది బీఆర్‌ఎస్‌. సిద్ధమవడమే కాదు.. ఆల్రెడీ నిరసనలకు పిలుపునిచ్చేసింది ప్రతిపక్షం. గృహలక్ష్మి, దళితబంధు, గొర్రెల పంపిణీ వంటి సంక్షేమ పథకాలను కొనసాగించాల్సిందే అంటోన్న బీఆర్‌ఎస్‌.. వాటిని రద్దుచేస్తే ఊరుకునేది లేదంటూ వార్నింగ్‌ ఇస్తోంది. ప్రజలకు లబ్ధి చేకూర్చే సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేయడమంటే బలహీనవర్గాలకు తీరని ద్రోహం చేయడమేనని మండిపడుతోంది.

పార్టీ నేతలు, శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన కేటీఆర్‌, హరీష్‌.. ఆయా పథకాలను రద్దుచేస్తే పెద్దఎత్తున నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలకు లబ్ధి చేకూర్చే పథకాలను రద్దుచేస్తే చూస్తూ ఊరుకోబోమంటూ అల్టిమేటం ఇచ్చారు కేటీఆర్‌. ప్రజాసంక్షేమం కోసం గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి, దళితబంధు లాంటి పథకాలను కొనసాగించాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ఒకవేళ ఈ పథకాలను రద్దుచేస్తే మాత్రం పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. పట్టణాల అభివృద్ధికి గత ప్రభుత్వం కేటాయించిన నిధులను కూడా నిలిపివేస్తున్నారని మండిపడ్డారు. ఇలాగైతే ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ రోడ్ల అభివృద్ధి నిలిచిపోతుందని ఆవేదన వ్యక్తంచేశారు కేటీఆర్‌. వీటన్నింటిపై ఎక్కడికక్కడ నిరసనలు తెలపాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జ్‌లు, ముఖ్యనేతలకు సూచించారు. ప్రజాసంక్షేమం కోసం లబ్ధిదారుల తరపున ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు కేటీఆర్‌.📣🗣️

bottom of page