తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకుపోతోంది. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దిశగా వెళ్తోంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని తెలుస్తోంది.
ఇందులో భాగంగానే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వేడుకలను ప్రారంభించాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ర్యాలీగా గాంధీ భవన్ చేరుకున్నారు. ఇక ఇతర పార్టీ నాయకులు సైతం కాంగ్రెస్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బీఆర్ పార్టీ వర్కింట్ ప్రెసిడెండ్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఎన్నికల ఫలితాలపై స్పందించారు.
కేటీఆర్ ట్వీట్..
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ స్పందిస్తూ.. ‘బీఆర్‌ఎస్ పార్టీకి వరుసగా రెండు సార్లు ప్రభుత్వాన్ని అందించినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు. ఈరోజు ఫలితం గురించి బాధపడలేదు, కానీ అది మాకు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఖచ్చితంగా నిరాశ చెందాము . కానీ మేము దీన్ని ఒక పాఠంగా తీసుకుంటాము, తిరిగి పుంజుకుంటాము. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు. మీకు శుభం జరగాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.
ఇక శనివారం రాత్రి చేసిన ట్వీట్‌పై సైతం కేటీఆర్ స్పందించారు. ‘హ్యాట్రిక్ లోడింగ్ 3.0 వేడుకలకు సిద్ధంగా ఉండండి’ అంటూ గన్ ఎయిమ్ చేస్తున్న ఫొటోను ట్వీట్ చేసిన కేటీఆర్.. తాజాగా దానినే మళ్లీ రీట్వీట్ చేస్తూ.. ‘ఈసారి టార్గెట్‌ను మిస్ అయ్యాము’ అంటూ రాసుకొచ్చారు.