top of page
MediaFx

మార్కెట్‌ను ఊపేస్తున్న బడ్జెట్‌ బైక్స్‌ కొనుగోళ్లు…మైలేజ్‌లో వీటికి లేదు పోటీ

బజాజ్ ప్లాటినా భారతదేశంలోని బడ్జెట్‌ బైక్స్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్స్‌లో ఒకటి. ఈ బైక్‌ ప్రారంభ ధర 67,808 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అలాగే ఈ బైక్‌ లీటర్‌కు 73 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. అలాగే 11 లీటర్ ఇంధన ట్యాంక్‌తో వచ్చే ఈ బైక్‌ను ఫుల్‌ ట్యాంక్‌ చేయిస్తే 803 కిలోమీటర్లు దూసుకుపోవచ్చు.

హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బడ్జెట్ సెగ్మెంట్‌లోని ప్రముఖ బైక్స్‌లో ఒకటి. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 59,998 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ బైక్‌ లీటర్‌ 70 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది. ఈ బైక్‌ 9.6 లీటర్ల ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ బైక్‌లో ఓ సారి ట్యాంక్‌ ఫుల్‌ చేయిస్తే 672 కిలో మీటర్ల మైలేజ్‌ వస్తుంది. హెూండా లివో జపాన్ బ్రాండ్‌కు సంబంధించిన అత్యంత సరసమైన మోటార్ సైకిళ్లలో ఒకటి. బైక్ ప్రారంభ ధర రూ.78,500 (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ లీటర్‌కు 74 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. అలాగే ఈబైక్‌ 9 లీటర్ ఇంధన ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అలాగే ఓ సారి ట్యాంక్‌ ఫుల్‌ చేయిస్తే ఇది 666 కిలో మీటర్లు దూసుకుపోతుంది. హెూండా ఎస్‌పీ125 ప్రారంభ ధర రూ.86,017 (ఎక్స్) షోరూమ్). ఇది లీటర్‌కు 65 కిలో మీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది. అలాగే ఈ బైక్‌ 11.2 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యంతో వస్తుంది. ఈ బైక్‌లో ఓ సారి ట్యాంక్‌ ఫుల్‌ చేయిస్తే 728 కిలో మీటర్ల మైలేజ్‌ వస్తుంది. టీవీఎస్‌ స్పోర్ట్స్ బడ్జెట్‌ బైక్స్‌ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటుంది. ఈ బైక్‌ ప్రారంభ ధర రూ. 59,431 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ బైక్ లీటర్‌కు 75 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. అలాగే ఋ బైక్‌ 10 లీటర్ల ఇంధన ట్యాంక్‌తో వస్తుంది. అందువల్ల ఈ బైక్‌ను ఫుల్‌ ట్యాంక్‌ చేయిస్తే 750 కిలోమీటర్లు మైలేజ్‌ను అందిస్తుంది.

bottom of page