ఒవైసీ కాలేజీ కూల్చేందుకు బుల్డోజర్లు దొరుకుతలేదా?: ఎమ్మెల్యే రాజాసింగ్
- MediaFx
- Sep 9, 2024
- 1 min read
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఫాతిమా ఒవైసీ కాలేజీ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఎంఐఎంతో కాంప్రమైజ్ అయ్యారా? లేక అక్బరుద్దీన్ ఒవైసీ వార్నింగ్ ఇస్తే భయపడ్డారా? అని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో జరుగుతున్నది హైడ్రా కార్యక్రమాలు కాదని, హైడ్రామా నడుస్తున్నదని ప్రజలే అంటున్నారని ఆదివారం విడుదల చేసిన ఓ వీడియోలో విమర్శించారు. హైడ్రా ఆధ్వర్యంలో పేదల ఇండ్లు కూల్చడానికి పెద్ద పెద్ద జేసీబీలు, మిషన్లు దొరుకుతున్నాయి కానీ, ఫాతిమా ఒవైసీ కాలేజీని కూల్చడానికి ఎందుకు దొరకట్లేదని ప్రశ్నించారు. పేదల ఇండ్లను వెంటవెంటనే కూలగొడ్తున్నారని, ఫాతిమా ఒవైసీ కాలేజీని ఎప్పుడు కూలుస్తారో చెప్పాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను డిమాండ్ చేశారు.