top of page
MediaFx

బంపర్ ఆఫర్ కొట్టేసిన ప్రేమలు బ్యూటీ..

చిన్న సినిమాలు పెద్ద విజయం సాదించడటం కామనే.. ఇప్పటికే చాలా సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయాలు సాధించాయి. అలాగే మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి . ఈ క్రమంలోనే రీసెంట్ గా ప్రేమలు అనే సినిమా రిలీజ్ అయ్యింది. ప్రేమలు సినిమా మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ అయ్యింది. తెలుగులోనూ ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన మమిత బైజు కు మంచి క్రేజ్ వచ్చింది. ఈ చిన్నదాన్ని చూసిన ఆడియన్స్ ఎవరు ఈ అమ్మడు అంటూ సోషల్ మీడియాను గాలిస్తున్నారు. ప్రేమలు సినిమాతో మమిత బైజు ఓవర్ నైట్ లో క్రేజ్ సొంతం చేసుకుంది.

ఇక ఇప్పుడు ఈ చిన్నదానికి ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ ఈ అమ్మడికి అదిరిపోయే ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ లో కృతి శెట్టి , శ్రీలీల  ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకొని ఆఫర్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఇదే తరహాలో ఇప్పుడు మమిత బైజు కూడా ఆఫర్స్ అందుకుంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ బ్యూటీకి క్రేజీ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమాలో మమిత బైజు హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తోంది. రీసెంట్ గా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు విజయ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలను ఎంపిక చేశారు. అయితే డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో శ్రీలీల ఆ సినిమా నుంచి తప్పుకుందని తెలుస్తోంది. ఇప్పుడు ఆమె ప్లేస్ లోకి మమిత బైజు వచ్చిందని  ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.


bottom of page