top of page

🏏 ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు నుంచి బుమ్రా, రాహుల్ ఔట్.. ముకేశ్ మళ్లీ వచ్చాడు 💫

Suresh D

🏏 ఇంగ్లండ్ తో జరగనున్న నాలుగో టెస్టు నుంచి బుమ్రాను జట్టు నుంచి రిలీజ్ చేయగా.. మరోవైపు హైదరాబాద్ టెస్టు సందర్భంగా గాయపడిన కేఎల్ రాహుల్.. ఇప్పుడు నాలుగో టెస్టు కూడా ఆడటం లేదు. దీంతో టీమిండియా మరింత బలహీనపడింది.

🏏 ఇంగ్లండ్ తో మూడో టెస్టులో రికార్డు విజయం సాధించిన టీమిండియా నాలుగో టెస్టుకు మాత్రం మరింత బలహీనపడింది. ఊహించినట్లే స్టార్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చారు. ఈ విషయాన్ని బీసీసీఐ ధృవీకరించింది. వరుసగా మూడు టెస్టులతో ఈ పేస్ బౌలర్ పై భారం పెరిగిపోవడంతో నాలుగో టెస్టుకు విశ్రాంతి ఇచ్చారు. అతని స్థానంలో ముకేశ్ కుమార్ తిరిగి వచ్చాడు.రంజీ ట్రోఫీలో యూపీకి ఆడాలంటూ మూడో టెస్టు నుంచి ముకేశ్ ను పంపించిన మేనేజ్‌మెంట్ అతన్ని మళ్లీ జట్టులోకి తీసుకున్నారు. బుమ్రా ఈ సిరీస్ లో 17 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా ఉన్నాడు. ఇప్పుడతను లేకపోవడంతో పేస్ బౌలింగ్ భారం సిరాజ్ పై పడనుంది. మరోవైపు హైదరాబాద్ టెస్టు సందర్భంగా గాయపడిన కేఎల్ రాహుల్.. ఇప్పుడు నాలుగో టెస్టు కూడా ఆడటం లేదు. చివరి టెస్టుకు పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే అందుబాటులో ఉంటాడని కూడా బోర్డు చెప్పింది.


🏏 నాలుగో టెస్టుకు ఇండియన్ టీమ్

రోహిత్ శర్మ, యశస్వి, గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్, కేఎస్ భరత్, దేవదత్ పడిక్కల్, అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, సుందర్, కుల్దీప్, సిరాజ్, ముకేశ్ కుమార్, ఆకాశ్ దీప్ 🏏

 
bottom of page