టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమా పుష్ప 2. పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వచ్చిన పుష్ప పార్ట్ 1 భారీ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు పుష్ప 2 పై మరింత హైప్ పెరిగింది. ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, బన్నీ స్పెషల్ వీడియో ఈ మూవీపై మరింత అంచనాలు పెంచేశాయి. అయితే కొన్నాళ్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్, హీరో బన్నీ మధ్య మనస్పర్థలు వచ్చాయని.. దీంతో వీరిద్దరి మధ్య గ్యాప్ రావడంతో సినిమా షూటింగ్ ఆలస్యమవుతుందని పలు రకాలుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి బన్నీ వెకేషన్ వెళ్లారు. ఆ సమయంలో అల్లు అర్జున్ గడ్డం ట్రిమ్ చేసి కనిపించడంతో డైరెక్టర్, హీరోకు మధ్య గ్యాప్ వచ్చిందనే రూమర్స్ కు మరింత బలం చేకూరింది. తాజాగా పుష్ప 2 రూమర్స్ పై ప్రొడ్యూసర్ బన్నీవాస్ స్పందించారు. తాజాగా ఆయ్ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న ఆయనకు పుష్ప 2కు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. పుష్ప 2పై మీడియాలో వస్తున్న వార్తలు చూస్తే నవ్వు వస్తోందని అన్నారు. అల్లు అర్జున్, సుకుమార్ అలాగే తన బాండింగ్ జీవితాంతం ఉంటుందని అన్నారు.
శుక్రవారం జరిగిన ‘ఆయ్’ సినిమా ప్రెస్‌మీట్‌లో స్పందించారు. ఈ సందర్భంగా ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ “‘పుష్ప-2 గురించి మీడియాలో వస్తున్న న్యూస్ లు చూసి నవ్వుకునే స్థితిలో మేమున్నాం. అల్లు అర్జున్ షూటింగ్ పార్ట్ 15 నుంచి 20రోజుల లోపు ఉంది. ఇది కాకుండా వేరే ఆర్టిస్టులతో కూడా చిత్రీకరణ మిగిలి ఉంది. దర్శకుడు సుకుమార్ ఎడిటింగ్ చూసుకుని ఇంకా ఏమైనా అల్లు అర్జున్ పార్ట్ బ్యాలెన్స్ వుందేమో క్లారిటీ తెచ్చుకుని షూటింగ్ పెట్టుకుందాం అన్నారు. అల్లు అర్జున్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ట్రీమ్ చేశారు. అల్లు అర్జున్ సుకుమార్‌కు నాకు ఉన్న బాండింగ్ లైఫ్ లాంగ్ అలానే వుంటుంది. ఆగష్టు మొదటి వారంలో షూటింగ్ మొదలవుతుంది పుష్ప లాంటి పాన్ ఇండియా క్రేజీ ఫిలింని సింపుల్ గా ఎందుకు తీసుకుంటారు” అని అన్నారు. దీంతో పుష్ప 2 వస్తోన్న రూమర్స్ పై స్పష్టత వచ్చింది.