ప్రస్తుతం పాకిస్తాన్‌లో కేజీ ఉల్లి ధర 150 నుండి 300 రూపాయలకు పెరిగింది. రంజాన్‌కు ముందు కాలంలో బంగాళదుంప ధర కేజీ 50 పీకేఆర్ ఉండగా.. ప్రస్తుతం 80 రూపాయలకు పెరిగింది.
క్యాబేజీ ధరకిలో ధర 80-100గా పీకేఆర్ నుంచి 150 పీకేఆర్‌కు పెరిగింది. పచ్చిమిర్చి కిలో 200 నుంచి ఏకంగా 320 రూపాయలకు విక్రయిస్తున్నారు. క్యాప్సికం ధర కూడా రెట్టింపు పెరిగింది. కిలో 400 రూపాయలకు చేరింది. సాధారణంగా రంజాన్ మాసంలో పండ్ల విక్రయాలు పెరుగుతాయి. చిన్న సైజు అరటి పండ్ల ధర డజను 80 నుంచి 120 రూపాయలకు పెరిగింది. మంచి నాణ్యమైన పెద్ద అరటిపండ్లు డజన్‌కు 200 రూపాలయకు విక్రయిస్తున్నారు. పుచ్చకాయ ధర కూడా 150 నుంచి 200 రూపాయలకు అమ్ముతున్నారు.
గత కొన్ని నెల క్రితం పాకిస్తాన్ వ్యాప్తంగా కూరగాయలు, సరుకుల సాధారణ పెరుగుదల 31.5 శాతం ఉండేది. కానీ పండుగ మాసంలో గతంకంటే 60 శాతం వరకు పెరిగాయి. కూరగాయల ధరలతో పాటు వివిధ రకాల పండ్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. అవకాశాన్ని వాడుకుంటున్న కొందరు వ్యాపారుల కారణంగా కూడా దేశవ్యాప్తంగా ధరలు గణనీయంగా పెరిగేందుకు కారణం. ఇలా హఠాత్తుగా నిత్యావసర వస్తువుల ధరలలో ఈ గణనీయమైన పెరుగుదల తక్కువ-మధ్య-ఆదాయ వినియోగదారుల ఆర్థిక బాధలను పెంచింది. 💰