top of page
MediaFx

చాటింగ్ చూసి విడాకులిచ్చిన భార్య..💔📱


ఇంగ్లాండ్ కు చెందిన ఓ బిజినెస్ మ్యాన్, తన విడాకులకు యాపిల్ కంపెనీనే కారణమని కోర్టులో 5 మిలియన్ డాలర్ల పరిహారం కోరుతూ దావా వేశాడు. ఏమైందంటే, ఇంట్లో ఐమ్యాక్ తో ఓ సెక్స్ వర్కర్ తో చాటింగ్ చేసిన భర్త, ఆ మెసేజ్ లను డిలీట్ చేసి నిశ్చింతగా ఉండిపోయాడు. కానీ, యాపిల్ ఐడీతో సింక్రనైజేషన్ వల్ల ఈ మెసేజ్ లు భార్య ఫోన్ లో కూడా కనిపించాయి.

తన భర్త నిర్వాకాన్ని ఫోన్ లో చూసిన భార్య కోర్టుకు వెళ్లి విడాకులు కోరుతూ దావా వేసింది. 5 మిలియన్ డాలర్లు భరణం చెల్లించాల్సి వస్తుందని భర్త వాపోయాడు. దీనంతటికీ యాపిల్ కంపెనీనే కారణమని ఆరోపించాడు.

భర్త పేర్కొన్నది ఏమంటే, మెసేజ్ లు డిలీట్ చేసినపుడు 'యువర్ మెసేజెస్ ఆర్ డిలీటెడ్' అని సందేశం రావడం, 'యువర్ మెసేజెస్ డిలీటెడ్ ఆన్ దిస్ డివైజ్' అనో లేక 'యువర్ మెసేజెస్ డిలీటెడ్ ఆన్ దిస్ డివైజ్ ఓన్లీ' అనో సందేశం కనిపిస్తే ఈ స్థితి వచ్చేది కాదని చెప్పాడు.

తానే తన భార్యకు ఈ విషయాన్ని చెప్పేవాడినని, అయినా సరే గొడవ జరిగే అవకాశం ఉందని ఒప్పుకున్నాడు. కానీ విడాకుల వరకు మాత్రం ఈ పరిస్థితి రాదని అన్నాడు. యాపిల్ సింక్రనైజేషన్ వల్ల తన భార్య చాలా హర్టయిందని, ఆర్థికంగా నష్టపోయానని యాపిల్ బాధ్యత వహించాలని స్పష్టం చేశాడు.

bottom of page