సీఏ ఎగ్జామ్ క్రాక్ చేసిన చాయ్ వాలా కూతురు..మనసును కట్టి పడేసింది..
- MediaFx
- Jul 22, 2024
- 1 min read

ఢిల్లీకి చెందిన ప్రజాపతి అనే వ్యక్తి.. టీ అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి అమిత అనే కూతురు ఉంది. తను పడిన కష్టాలు తన కూతురు పడొద్దని.. కూతుర్ని చదివించాడు. కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి కష్టాలు, చీదరింపులు వచ్చినా తట్టుకుని నిలబడ్డాడు. చివరికి కూతురు అమిత.. తన తండ్రి కలను సాకారం చేసింది. పదేళ్లు కష్ట పడి చదివిన తన కల సాకారం అయ్యింది. మొత్తానికి ఛార్టెడ్ అకౌంటెంట్ (CA) పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. అనంతరం తన తల్లిదండ్రులకు థాంక్స్ చెబుతూ ఓ వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతూ..లైక్, కామెంట్స్ చేస్తున్నారు.