top of page

ఇదేం పనిరా..పెళ్లైన 3 నిమిషాలకే ఆగలేకపోయారా..?


దుబాయ్ యువరాణి షైఖా మహరా తన భర్తకు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా విడాకులిచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఇక్కడొక యువతి పెళ్లయిన మూడు నిమిషాల్లోనే కళ్యాణ మండపంలో భర్తకు విడాకులు ఇచ్చింది. ఈ ఘటన కువైట్‌లో జరిగింది. వివరాల్లో కెళ్తే.. వివాహ వేడుకలో తంతు జరుగుతుండగా.. వధువు పొరపాటున స్లిప్ అయ్యి పడిపోయింది. ఆ సమయంలో వరుడు, అతడి కుటుంబసభ్యులు ఆమెను అవమానించారు. దీంతో అసహనానికి గురైన యువతి.. అదే హాలులో భర్తకు పెళ్లైన మూడు నిమిషాలకే విడాకులు ఇచ్చింది. ఇస్లామిక్ చట్టంలో, తక్షణ విడాకుల ప్రక్రియను “తలాక్-ఎ-బిద్దత్” అని అంటారు. అక్కడ భర్త వివాహాన్ని రద్దు చేసుకోవడానికి మూడుసార్లు “తలాక్” చెప్తాడు. అయితే ఈ మధ్యకాలంలో భార్యలు తలాక్ ఇచ్చే సంఘటనలు ఎక్కువైపోయాయి. ప్రస్తుతం, ఈ మూడు నిమిషాల విడాకుల ఘటన ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.

 
 
bottom of page