ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు మీ బ్యాంక్ ఖాతాను జాగ్రత్తగా ఫిల్ చేయండి. పబ్లిక్ Wi-Fi ని ఉపయోగించకపోవడం చాలా మంచిది. తరచుగా ప్రజలు సైబర్ కేఫ్ లేదా రెస్టారెంట్ వంటి పబ్లిక్ ప్రదేశంలో పబ్లిక్ Wi-Fi ద్వారా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడం ప్రారంభిస్తారు. అలాంటి పరిస్థితిలో వారి బ్యాంక్.. వారి వివరాలను హ్యాకర్లు సులభంగా హ్యాక్ చేయవచ్చు.
నిజానికి ఆన్‌లైన్ షాపింగ్ చేయాలంటే గూగుల్‌లోకి వెళ్లి సంస్థల పేరు సెర్చ్ చేయాలి. అందులోకి వెళ్లి కావాల్సినవి ఆర్డర్ చేయాలి. అంతేగానీ అపరిచిత వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చే మెసేజ్‌లకు స్పందిస్తే మోసపోవడం ఖాయం. అందుకే అలాంటి వాటికి రెస్పాండ్ కావొద్దంటున్నారు సీసీఎస్ పోలీసులు. పండుగ వేళ మరింత అప్రమత్తంగా ఉండాలని సజెస్ట్ చేస్తున్నారు.