top of page
Suresh D

హాఫ్ సెంచరీ కొట్టిన ‘అయాలన్’ - ధనుష్‌ను వెనక్కి నెట్టిన శివకార్తికేయన్!

శివకార్తికేయన్ హీరోగా నటించిన ‘అయాలన్’ మూవీ కలెక్షన్స్ విషయంలో దూసుకుపోతోంది. మౌత్ టాక్‌తోనేే ఈ మూవీ హాఫ్ సెంచరీ కలెక్షన్స్‌ను కొల్లగొట్టిందని మేకర్స్ అనౌన్స్ చేశారు.

తమిళనాడులో సంక్రాంతి సందర్భంగా శివకార్తికేయన్ హీరోగా నటించిన ‘అయాలన్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ధనుష్ హీరోగా నటించిన ‘కెప్టెన్ మిల్లర్’కు పోటీగా ఈ మూవీ విడుదలయ్యింది. ‘కెప్టెన్ మిల్లర్’ ముందు ‘అయాలన్’ నిలబడడం కష్టమని చాలామంది అనుకున్నా.. దానికి భిన్నంగా ‘అయాలన్’ కలెక్షన్సే రోజురోజుకీ ఇంప్రూవ్ అవుతున్నాయి. విడుదలయిన ఫస్ట్ వీకెండ్ పూర్తవ్వగానే ఈ మూవీ హాఫ్ సెంచరీ కొట్టినట్టు మేకర్స్.. స్పెషల్ పోస్టర్‌తో అనౌన్స్ చేశారు. దీంతో సంక్రాంతి సెలవులు ‘అయాలన్’కు బాగా వర్కవుట్ అయ్యిందని శివకార్తికేయన్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ‘అయాలన్’కు రూ.50 కోట్లు బాక్సాఫీస్ కలెక్షన్స్ వచ్చాయని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇప్పటికీ ఈ మూవీ తమిళ వర్షన్ మాత్రమే రిలీజ్ అయ్యింది. అసలైతే దీని తెలుగు డబ్బింగ్ వర్షన్‌కు థియేటర్లలో సందడి చేయాల్సి ఉంది. కానీ అప్పటికే సంక్రాంతికి తెలుగులో నాలుగు సినిమాలు పోటీకి సిద్ధమయ్యాయి. అందుకే డబ్బింగ్ చిత్రానికి థియేటర్లు దొరకడం కష్టమని.. ఒకవేళ దొరికినా కలెక్షన్స్ అంతంత మాత్రంగానే వచ్చే అవకాశాలు ఉంటాయని మేకర్స్ వెనక్కి తగ్గారు. ఇక ఇప్పటికీ ‘అయాలన్’ తెలుగు వర్షన్ విడుదలపై ఎలాంటి క్లారిటీ లేదు. త్వరగా విడుదలయితే బాగుంటుందని శివకార్తికేయన్ తెలుగు ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

bottom of page