top of page
MediaFx

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అదా శర్మ..

హెల్త్ ఇష్యూస్‌ సెలబ్రిటీలకు ఉండవా? ఎప్పుడూ మేకప్‌ ముసుగుల్లో కనిపించే వారికి లోలోపల అంతా హ్యాపీగానే ఉంటుందా? పైకి చిందించే నవ్వులు లోపల కూడా ఉంటాయా? వాళ్ల జీవితం వాళ్లంత అందంగానే ఉంటుందా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నెన్నో ఉంటాయి చాలా మంది మనసుల్లో. కొందరు చెప్పుకుంటారు. మరికొందరు చెప్పుకోలేరు అనే మాట ఒకటి ఉంటుంది కదా... నిన్న మొన్నటిదాకా చెప్పుకోని సెలబ్రిటీలు ఇప్పుడు మెల్లిగా నోరు విప్పుతున్నారు. ఇబ్బందులను చెప్పేస్తున్నారు.

ఒక సినిమాకు బరువు పెరగాలి. మరో సినిమాకు బరువు తగ్గాలి అనే కాన్సెప్ట్ అంత తేలిక కాదని అంటున్నారు నటి అదా శర్మ. సినిమానే ప్రాణంగా అనుకున్నప్పుడు ఇలాంటి రిస్కులు చేయడానికి తామెప్పుడూ వెనకాడమని అన్నారు. తన లైఫ్‌లో రీసెంట్‌ టైమ్స్ లో చేసిన ఇలాంటి ప్రయోగాల వల్ల హెల్త్ ఇష్యూస్‌ వచ్చాయని అంటున్నారు ఈ బ్యూటీ.

బరువు పెరగాలన్న తాపత్రయం, తగ్గాలన్న ఆందోళనతో ఒత్తిడికి గురయిన సందర్భాలు చాలా ఉన్నాయని అంటున్నారు అదా శర్మ. దీని వల్ల తనకు హార్మోనల్‌ ఇంబాలెన్స్ అయిందని చెప్పారు. ఒక్కసారి హార్మోన్స్ ఇంబాలెన్స్ అయితే రకరకాల ఇబ్బందులు మొదలవుతాయని చెప్పారు.

ఇటీవల ఎండోమెట్రియోసిస్‌ అనే వ్యాధి సోకిందట అదా శర్మకి. దీని వల్ల దాదాపు 48 రోజుల పాటు నాన్‌స్టాప్‌ పీరియడ్స్ తో బాధపడ్డారట. అయినా విశ్రాంతి తీసుకునే పరిస్ఙతి లేదట. ఆల్రెడీ కాల్షీట్లు ఇవ్వడం వల్ల నిర్విరామంగా పనిచేయాల్సి వచ్చిందని అన్నారు అదా శర్మ.

ఎంత హైజీనిక్‌గా ఉన్నా, మానసికంగా ప్రశాంతంగానూ ఉండగలగడం చాలా ముఖ్యమని చెబుతున్నారు. రీసెంట్‌ టైమ్స్ లో సాయిపల్లవి, శ్రుతిహాసన్‌ కూడా పీరియడ్స్ ఇబ్బందుల గురించి మనసులోని మాటలను జనాలతో పంచుకున్నారు. లేటెస్ట్ గా అదా చెప్పిన మాటలు వింటుంటే... అయ్యో... వీళ్లు ఇంతింత కష్టపడతారా అనిపిస్తోందని అంటున్నారు నెటిజన్లు.

bottom of page