ఇక ఉపాధి, నైపుణ్యం, MSMEలు (మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్)తో పాటు మధ్యతరగతి వంటి నాలుగు ప్రధాన రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. దేశంలోని 4.1 కోట్ల మంది యువతకు ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం ఈ నాలుగు రంగాలపై దృష్టి సారిస్తుందని ఆమె చెప్పారు. ఈ రంగాలకు రానున్న రోజుల్లో రూ. 2 లక్షల కోట్ల నిధులను కేటాయించనున్నట్లు మంత్రి వివరించారు. అలాగే జాబ్ మార్కెట్‌లోకి అడుగుపెట్టే దాదాపు 30 లక్షల మంది యువతకు ఒక నెల ప్రావిడెంట్ ఫండ్ సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్ కారణంగా దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గనున్నాయి. అలాగే స్మార్ట్ ఫోన్‌ల ధరలు కూడా తగ్గే జాబితాలో ఉన్నాయి. సెల్‌ఫోన్లపై 15 శాతం కస్టమ్ డ్యూటీ తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే లెదర్ ఉత్పత్తులపై పన్ను శాతం తగ్గించనున్నారు. వీటితో పాటు మూడు క్యాన్సర్ మందులపై జీఎస్టీ తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎక్స్‌రే మిషన్లపై జీఎస్టీ తగ్గించనున్నారు. ఇక 25 రకాల కీలక ఖనిజాలపై కస్టమ్ డ్యూటీతో పాటు, సోలార్ ఉత్పత్తులపై కస్టమ్ డ్యూటీ తగ్గించనున్నారు. ఈ ఏడాది మొత్తం రూ.32.07 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది.