top of page
MediaFx

జీవితంలో విజయాన్ని తెచ్చే చాణక్య విధానాలు..


ఆచార్య చాణక్యుడు రాజనీతిజ్ఞుడు. అపారమైన తెలివి తెలివితేటలు కలిగిన వ్యక్తీ. చానిక్యుడు తన విద్య, జ్ఞానం, తన ప్రత్యేక విధానాలతో మౌర్య సామ్రాజ్యాన్ని బలోపేతం చేశాడు. గొప్ప జాతీయ శక్తిగా ఎదిగేలా చేశాడు. రాజ్యపాలన గురించి మాత్రమే కాదు.. మానవ సంక్షేమం కోసం జీవితానికి సంబంధించిన ప్రతి అంశంపై ఆచార్య చాణక్యుడు తన అభిప్రాయాలను వెల్లడించారు. ఎవరైనా సరే జీవితంలో ఆచార్య చాణక్యుడి ఆలోచనలు, విధానాలను అవలంబించడం ద్వారా సంతోషంగా, సంపన్నమైన జీవితాన్ని గడపవచ్చు అని నమ్మకం. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో అనేక జీవన విధానాలను అందించాడు. వాటిని అనుసరించడం ద్వారా ఎవరైనా సరే ప్రతికూల పరిస్థితులలో కూడా జీవితంలోని ప్రతి రంగంలో విజయం సాధించగలడు.జీవితంలోని ప్రతి రంగంలో విజయాన్ని తెచ్చే ఆచార్య చాణక్యుడి కొన్ని ముఖ్యమైన విధానాలు. నమ్మకం “నమ్మకం, విశ్వాసం ఉన్న వ్యక్తి ఎప్పుడూ విఫలం కాడు.” చాణక్యుడు విశ్వాసాన్ని చాలా ముఖ్యమైనదిగా భావించాడు. ఇంకా చెప్పాలంటే విశ్వాసం.. విజయానికి కీ వంటిది అని చెప్పాడు. ఉత్సాహంగా ఉండడం “ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఉత్సాహంగా ఉండే ఎప్పుడు నిరాశకు గురి కాడు” ఉత్సాహాన్ని విజయంలో ముఖ్యమైన భాగమని చాణక్యుడు అభివర్ణించాడు.

నీతి నిజాయతీ “నీతి కంటే గొప్ప సంపద లేదు.” నీతి, నిజాయతీ, సామర్థ్యం మాత్రమే వ్యక్తిని విజయ శిఖరాలకు తీసుకెళ్తాయని చాణక్యుడు చెప్పాడు

కఠినమైన నిర్ణయాలు “కష్టపడి సాధించేది మాత్రమే విలువైనది.” విజయానికి కృషి , సామర్థ్యం చాలా అవసరమని చాణక్యుడు వివరించాడు.

జ్ఞానమే నిజమైన సంపద “మనిషికి నిజమైన సంపద అతని జ్ఞానం.” జ్ఞానాన్ని తెలివితేటలను మరెవరూ దొంగిలించలేరు లేదా దోచుకోలేరు.

మనసు చెప్పిందే వినండి “ప్రతి క్షణం పరిస్థితులను పరిశీలిస్తూ దృష్టిని పెట్టె వ్యక్తి మాత్రమే జీవితంలో విజయం సాధించగలడు.” ఎవరి గురించి అయినా సరే పూర్తిగా తెలియకుండా గుడ్డిగా నమ్మకూడదు.

శత్రువులపై నిఘా ఉంచండి “శత్రువులను దృష్టికి దూరంగా ఉంచవద్దు.” శత్రువులను తనకు దగ్గరగా ఉంచుకోవాలని చాణక్యుడు సలహా ఇచ్చాడు. ఎందుకంటే చాణక్యుడు చెప్పిన ప్రకారం శత్రువు గురించి బాగా తెలుసుకోవడం , అర్థం చేసుకోవడం అవసరం. మనం మన శత్రువులకు దగ్గరగా ఉన్నప్పుడు.. వారి పరిస్థితి, వారి ఉద్దేశాలు, వారి ఆలోచనల గురించి మరింత సమాచారం పొందవచ్చు. అంతేకాకుండా వారి ప్రణాళికను కూడా ప్రపంచానికి తెలియజేయవచ్చు. తద్వారా శత్రువులు వేసే ప్రణాళికలు విఫలమవుతాయి.

bottom of page