top of page

పెళ్లి తర్వాత సంతోషంగా ఉండాలంటే పెళ్ళికి ముందు ఈ విషయాలు తెలుసుకోమంటున్న చాణక్య..

MediaFx

చాణక్యుడి ప్రకారం వైవాహిక జీవితంలో చిన్న స్పర్ధ ఏర్పడితే అప్రమత్తంగా ఉండాలి. అయితే పెళ్లికి ముందు కాబోయే భాగస్వామిని గురించి తెలుసుకునేందుకు తప్పనిసరిగా మూడు ప్రశ్నలు అడగాలి. అప్పుడు వివాహానంతరం పవిత్రమైన సంబందంలో చీలికలు రావు. వివాహానికి సరైన వయస్సు

ఆచార్య చాణక్యుడి నీతి ప్రకారం వివాహానికి ముందు కాబోయే భాగస్వామి వయస్సును తప్పనిసరిగా తెలుసుకోవాలి. భార్యాభర్తల మధ్య వయోభేదంతోనే వారి మధ్య అవగాహన ఉంటుందని.. దంపతుల మధ్య అవగాహన లేకపోతే వైవాహిక జీవితం విచ్ఛిన్నానికి కారణం అవుతుంది. ఇద్దరి మధ్య అవగాహన కుదరకపోతే గొడవలు వచ్చే అవకాశం ఉంది. అందుకే భార్యాభర్తల మధ్య వయస్సు అంతరం ఎక్కువగా ఉండకూడదు. వయోబేధం ఎక్కువగా ఉంటే దాంపతుల మధ్య కలహాలకు అంతం ఉండదు.

ఆరోగ్యం గురించి సమాచారం

ఆచార్య చాణక్య నీతి ప్రకారం వివాహానికి ముందు కాబోయే భాగస్వామికి సంబంధించిన అన్ని ఆరోగ్య సంబంధిత సమాచారాన్ని తెలుసుకోవాలి. శారీరకంగా లేదా మానసికంగా ఏదైనా సమస్య ఉంటే స్పష్టంగా చెప్పాలి. ఇలా చేయడం వలన భవిష్యత్తులో ఇద్దరికీ ఇబ్బందులు కలుగవు.

పాత సంబంధాలు

ఆచార్య చాణక్యుడు పెళ్లికి ముందు కాబోయే భాగస్వామికి సంబంధించిన గత సంబంధం గురించి అడగాలి లేదా తెలుసుకోవాలి అని నమ్ముతారు. తమ సంబంధం గురించి పెళ్ళికి ముందే చెప్పడం వలన భవిష్యత్ వైవాహిక జీవితానికి చాలా మంచిది. దాపరికం లేని దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది.

bottom of page