top of page
MediaFx

18 వేల ఫోన్‌ను రూ. 12 వేలకే పొందే అవకాశం..


చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ ఐక్యూ.. జెడ్‌9ఎక్స్‌ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. అమెజాన్‌ వేదికగా అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌లో భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. అన్ని రకాల ఆఫర్లు కలుకుకొనే ఏకంగా రూ. 6 వేల వరకు డిస్కౌంట్‌ అందిస్తున్నారు.

ఐక్యూజెడ్‌ 9ఎక్స్‌ బేస్‌ వేరియంట్‌ 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 17,999కాగా ప్రస్తుతం 28 శాతం డిస్కౌంట్‌తో రూ. 12,998కే లభిస్తోంది. దీంతో పాటు పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 100 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 11,998కే సొంతం చేసుకోవచ్చు.

ఆఫర్లు ఇక్కడితోనే ఆగిపోలేదు. మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛంజ్‌ చేసుకోవడం ద్వారా గరిష్టంగా రూ. 12,200 వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు. ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 44 వాట్స్‌ ఫ్లాష్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 6000 ఎమ్‌ఏహెచ్‌ కెపాసిటీతో కూడిన బ్యాటరీని అందించారు.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌, 2 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాన్‌ 6 జెన్‌ 1 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

ఇక ఈ ఫోన్‌లో 6.72 ఇంచెస్‌తో కూడిన ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం. 100 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌తో ఈ స్క్రీన్‌ను తీసుకొచ్చారు. దీంతో స్క్రీన్‌ను సన్‌లైట్‌లో కూడా స్పష్టంగా చూడొచ్చు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వచ్చే ఈ ఫోన్‌లో ఐపీ 64 రేటింగ్‌తో వాటర్‌, డస్ట్‌ రెసిస్టెంట్‌ను అందించారు.

bottom of page