top of page
Kapil Suravaram

చంద్రబాబు, నితీష్ కుమార్ కింగ్ మేకర్లు అవుతారా..?


లోక్ సభ ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా మారాయి.. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మెజార్టీ స్థానాలు సాధించే దిశగా దూసుకెళుతోంది. ప్రారంభ ట్రెండ్స్ నాటినుంచి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ మార్క్ ను దాటగా.. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కూడా గట్టి పోటీనిస్తోంది.. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం.. ఎన్డీఏ కూటమి 292 సీట్లలో ఆధిక్యంలో ఉంది.. ఇండియా కూటమి 233 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.. ఇతరులు 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఈ క్రమంలో జాతీయ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.. ఊహించని విధంగా అంచనాలను తారుమారు చేస్తూ.. కాంగ్రెస్ కూటమి కూడా ఎక్కువ సంఖ్యలో సీట్లలో ఆధిక్యంలో ఉండటంతో.. స్వాతంత్ర్య అభ్యర్థులు.. పలు ప్రాంతీయ పార్టీలతో మాట్లాడుతున్నట్లు చర్చ జరుగుతుండటం ఆసక్తికరంగా మారింది.. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ అధినేత నితీష్ కుమార్, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ కింగ్ మేకర్లుగా మారుతారంటూ ఊహగానాలు వెలువడుతున్నాయి.

ఈ తరుణంలోనే.. నితీష్ కుమార్, చంద్రబాబు, నవీన్ పట్నాయక్ కింగ్ మేకర్లు అవుతారంటూ జాతీయ మీడియా వర్గాలు కథనాలు వెలువరించాయి. 225 సీట్లకుపైగా ఇండియా కూటమి లీడ్‌ కొనసాగుతుండటంతో .. టీడీపీ, జేడీయూ, బీజేడీతో కాంగ్రెస్‌ చర్చలు? జరుపుతుందంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. నితీష్ కుమార్, చంద్రబాబుతో కాంగ్రెస్‌ చర్చించే అవకాశమందని విశ్వనీయవర్గాలు చర్చించినట్లు ఊహగానాలు వెలువడతుండటం చర్చనీయాంశంగా మారింది. వారితో కేసీ వేణుగోపాల్, మమతా బెనర్జీ చర్చించనున్నట్లు సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది.. అయితే.. దీనిపై మాత్రం క్లారిటీ లేదు.. ఇవన్నీ ఊహగానాలు మాత్రమేనని.. అలాంటివి ఏం లేనట్లు ఆయా పార్టీల వర్గాలు కొట్టిపడేస్తున్నాయి.

ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. బీహార్ లో జేడీయూ 15, ఒడిశాలో బీజేడీ 3 స్థానాల్లో లీడ్ లో ఉన్నాయి.





bottom of page