top of page
Shiva YT

మాజీ సీఎం కేసీఆను చంద్రబాబు పరామర్శ..🗣️💬

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ సీఎం కేసీఆర్ పరామర్శించనున్నారు.

యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ను కలిసి పరామర్శిస్తారు. చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో యశోదా ఆసుపత్రికి బయలుదేరుతారు. మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈనెల 7 అర్థరాత్రి బాత్రూమ్‌లో జారిపడి, తుంటి ఎముక విరిగి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయనకు శాస్త్రచికిత్స జరిగింది. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.

యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ ను సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న రేవంత్ రెడ్డి.. మెరుగైన వైద్యం అందించాలని.. ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు తనకు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. 🩺👨‍⚕️💊


bottom of page