top of page

స్టేట్ గెస్ట్ గా నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి..!

ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ అద్భుతమైన ప్రమాణ స్వీకార వేడుక జూన్ 12న ఉదయం 11.27 గంటలకు గన్నవరం వద్ద కేసరపల్లి వేదికగా జరగబోతుంది. దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు.

ప్రధాని మోదీతో సహా పలువురు రాజకీయ నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి చంద్రబాబు నాయుడు నుంచి ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు మరియు ఈ రోజు సాయంత్రం 5 గంటలకు విజయవాడ చేరుకోనున్నారు.

జనసేన అధినేత పవన్ కూడా డిప్యూటీ సీఎంగా అదే రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారని సమాచారం.బాబాయ్ పవన్ కోసం కూడా రామ్ చరణ్ ఈ ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. రామ్ చరణ్ కూడా కేసరపల్లిలో జరగబోయే ప్రమాణ స్వీకారానికి రాబోతున్నాడని తెలిసి అభిమానులు కూడా భారీగా హాజరవనున్నట్టు తెలుస్తుంది. రామ్ చరణ్ వెళ్తుండటంతో మరి ఎన్టీఆర్ కూడా వస్తాడా అని సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. ఇటీవల కూటమి గెలుపు తర్వాత ఎన్టీఆర్ సోషల్ మీడియాలో అభినందిస్తూ ఓ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. మరి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఎన్టీఆర్ వస్తాడా అని కొంతమంది సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.


 
 
bottom of page