📆 బుధవారం సాయంత్రం సుమారు 5.45 గంటల తర్వాత ల్యాండింగ్ ప్రక్రియ మొదలుకానుంది. ఇస్రో శాస్త్రవేత్తల ప్రకారం.. సాయంత్రం 6.04గంటలకు చంద్రయాన్-3 జాబిల్లిపై దిగుతుంది.
దీన్ని సురక్షితంగా దించేందుకు భారత శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు అన్ని వ్యవస్థలను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నామని.. చంద్రయాన్-3 ప్రయాణం సాఫీగా సాగుతోందని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. చంద్రయాన్-3 విజయవంతమైతే భారత్ కొత్త రికార్డు సృష్టించనుంది. 🚀🌕
👀 వర్చువల్ గా వీక్షించనున్న ప్రధాని మోడీ.. 🌍 గతంలో ఏ దేశమూ కాలుమోపని చంద్రుడి దక్షిణ ధ్రువం మీద చంద్రయాన్ దిగే అపూర్వ ఘట్టాన్ని వీక్షించేందుకు యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దీనిని ఇస్రో సాయంత్రం 5.20 నుంచి లైవ్ టెలికాస్ట్ చేయనుంది. దీనిని వీక్షించేందుకు దేశవ్యాప్తంగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. కాగా.. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దక్షిణాఫ్రికా వెళ్లిన విషయం తెలిసిందే. ఇవాళ సౌతాఫ్రికాలో రెండో రోజు పర్యటన కొనసాగనుంది. ప్రధాని మోడీ బిజీగా ఉన్నప్పటికీ.. చంద్రయాన్ 3 ల్యాండింగ్ ప్రక్రియను వీక్షించనున్నారు. ప్రధాని మోడీ ఇస్రో శాస్త్రవేత్తలతో వర్చువల్‌గా ఈ మధుర క్షణాలను తిలకిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. 🚀🌕