జీవితంలో సక్సెస్ అవ్వాలని ఉందా.? ఈ ప్రశ్న అడిగితే ఎవ్వరైనా ఠక్కున ఉందనే చెబుతారు. విజయాన్ని కోరుకోని వారు ఎవరు ఉంటారు చెప్పండి. అయితే విజయం కోరుకున్నంత సులువు కాదు. ఇందుకోసం ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. ఎన్నో అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుంది. విజయం సాధించిన ప్రతీ ఒక్కరి వెనకాల ఎన్నో కష్టాలు ఉంటాయి. అయితే ఆ కష్టాలను ఇష్టాలుగా స్వీకరిస్తేనే విజయం సొంతం చేసుకోవచ్చు. జీవితంలో విజయం సాధించాలంటే కచ్చితంగా కొన్ని రకాల అలవాట్లను మార్చుకోవాలని చెబుతున్నారు. ఇంతకీ ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* అందరికీ రోజులో ఉండేది 24 గంటల మాత్రమే. అయితే ఎవరు ఎక్కువగా ఆ సయాన్ని ఉపయోగించుకుంటారనేదే విజయాన్ని నిర్ణయిస్తుంది. ఇందుకోసం మొదట చేయాల్సింది ఉదయాన్నే త్వరగా మేల్కోవడం. 5 గంటలకు నిద్రలేవడాన్ని అలవాటు చేసుకోండి రోజులో ఎంత సమయం మిగులుతుందో మీరే గమనిస్తారు.
* విజయం సాధించే వారిలో ఉండే మరో లక్షణం పుసక్త పఠనం. జీవితంలో గొప్ప స్థానంలో ఉన్న వారికి కచ్చితంగా పుస్తకం చదివే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా మోటివేషనల్‌కు సంబంధించిన పుస్తకాలను చదవడం వల్ల మీలో ఉత్సాహం వస్తుంది. ఒక్కసారి పుస్తకం చదవడం చేసుకుంటే మీలో జరిగే మార్పును స్పష్టంగా గమనిస్తారు.
* ఇక జీవితంలో అనుకున్నది సాధించాలంటే ముందుగా మన ఆరోగ్యం బాగుండాలి. అందుకే సక్సెస్ అయిన ప్రతీ ఒక్కరూ తమ వ్యక్తిగత ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తుంటారు. కచ్చితంగా ఉదయం వ్యాయామాలు చేస్తుంటారు. మంచి ఆహారం తీసుకుంటారు. రాత్రి సమయానికి నిద్రపోతారు. తక్కువ జబ్బులు పడేవారే ఎక్కువ పనిచేస్తారని గుర్తుంచుకోవాలి.
* మీ పక్కన ఉండే వారు కూడా పాజిటివ్ ఆలోచనతో ఉండే వారినే ఎంచుకోండి. అలాంటి వారితోనే స్నేహం చేయండి. కొందరు నిత్యం నెగిటివ్ ఆలోచనతో, నెగిటివ్ మాటలతో విసిగిస్తుంటారు. అలాంటి వారితో స్నేహం చేస్తే మీరు కూడా నెగిటివ్ దారిలోనే వెళ్తారు.
* జీవితంలో విజయం సాధించిన వారు ఎప్పుడైనా ఇతరులతో వాదనలకు దూరంగా ఉంటారు. వీలైనంత తక్కువ వాదిస్తుంటారు. ఎదుటి వ్యక్తితో వాదించే సందర్భంగా వచ్చినా సైలెంట్‌గా ఉంటారు తప్ప.. వాదనలకు దిగరు.